ETV Bharat / city

పట్టభద్రులకు 10 నెలల ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి: సీఎం జగన్​ - ap news

CM Review on Higher Education: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. టీచింగ్‌ స్టాఫ్‌ నియామకంలో సిఫారసులకు తావు లేదని స్పష్టం చేశారు. కోర్సులో భాగంగా పట్టభద్రులకు 10 నెలల ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేయాలన్నారు.రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు కలిపి ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

cm jagan on higher education
ఉన్నతవిద్యపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష
author img

By

Published : Apr 29, 2022, 8:09 PM IST

Updated : Apr 30, 2022, 3:35 AM IST

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు కలిపి ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. సాంకేతిక విద్య కళాశాలలకు ప్రత్యేకంగా జేఎన్‌టీయూ ఉన్నట్లే దీన్ని ఏర్పరచాలని సూచించారు. ఉన్నత విద్యపై క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ కళాశాలల విశ్వవిద్యాలయానికి మంచి పరిజ్ఞానం ఉన్నవారు నేతృత్వం వహించాలి. డిగ్రీ కోర్సులకు విలువను జోడించాలి. దేశంలో డిగ్రీ చదవాలనుకునే వారంతా ఏపీకి రావాలనేలా ఉండాలి. అధ్యాపక పోస్టులు ఎక్కడ ఖాళీ ఉన్నా వెంటనే భర్తీ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి. నియామకంలో ఎక్కడా సిఫార్సులకు అవకాశం ఉండకూడదు. పరీక్షలు నిర్వహించి, ఎంపికచేయాలి. బోధన సిబ్బంది కమ్యూనికేషన్‌ నైపుణ్యాన్ని పరిశీలించాలి. విశ్వవిద్యాలయాల్లో క్రమశిక్షణ, పారదర్శకత అత్యంత ముఖ్యం. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలి’ అని ఆదేశించారు.

నియోజకవర్గానికో ప్రభుత్వ కళాశాల

‘రాష్ట్రంలో నాలుగైదు విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకుని, వాటిని దేశంలోనే ఉత్తమ వర్సిటీల స్థాయికి తీసుకువెళ్లాలి. పట్టభద్రులకు తప్పనిసరిగా 10 నెలల ఇంటర్న్‌షిప్‌ ఉండాలి. మొదటి, రెండో సంవత్సరాల్లో రెండు నెలల చొప్పున, మూడో ఏడాది ఆరు నెలలు ఇంటర్న్‌షిప్‌ ఉండాలి. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 30 నైపుణ్య కళాశాలల్లోనూ ఇంటర్న్‌షిప్‌ కోసం ఏర్పాట్లు చేయాలి. ప్రతి నియోజకవర్గానికి ఒక డిగ్రీ కళాశాల ఉండాలి. జూనియర్‌ కళాశాలను డిగ్రీ కళాశాల స్థాయికి తీసుకువెళ్లాలి. దీని కోసం ‘నాడు-నేడు’ కింద పనులు చేపట్టాలి. చదువులు ఏదోలా సాగితే చాలనుకునేవాళ్లు డిగ్రీ కోర్సులను ఎంచుకునే పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది. కానీ, విదేశాల్లో డిగ్రీని చాలా అత్యుత్తమ కోర్సుగా భావిస్తారు. మన రాష్ట్రంలోనూ డిగ్రీ కోర్సులను సమర్థంగా రూపొందించాలి. డిగ్రీ కళాశాలలను ఆ స్థాయిలో అభివృద్ధి చేయాలి’ అని సీఎం జగన్‌ ఆదేశించారు.

అమ్మాయిల విద్యపై దృష్టిపెట్టాలి

‘ఉన్నతవిద్యలో స్థూల ప్రవేశాల నిష్పత్తి (జీఈఆర్‌) గణనీయంగా పెరగాలి. అందుకే విద్యాదీవెన, వసతిదీవెన అమలు చేస్తున్నాం. గతంలో చదివించే స్థోమత లేక అమ్మాయిలను పై చదువులకు పంపేవారు కారు. ఇలాంటి పరిస్థితులు ఉండకూడదనే అందరికీ విద్యాదీవెన, వసతి దీవెన వర్తింపజేస్తున్నాం. రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల్లో అమ్మాయిలు చదువులకు దూరమవుతున్నారు. ఈ అంశంపై ప్రత్యేకశ్రద్ధ పెట్టి, వారిలో చైతన్యం తీసుకురావాలి. కర్నూలు పశ్చిమ ప్రాంతం, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గతంలో కంటే జీఈఆర్‌ పెరిగింది. కానీ, దీంతో సంతృప్తి చెందకూడదు. జీఈఆర్‌ 80%కు పైగా ఉండాలి. ఉద్యోగాలను కల్పించేలా కోర్సులు ఉండాలి. ఇప్పుడున్న కోర్సులకు అనుబంధ కోర్సులు, ప్రత్యేక కోర్సులు తీసుకురావాలి. కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు పెరగాలంటే విద్యార్థులకు ఆంగ్లంలో ప్రావీణ్యం రావాలి. ఇందుకు అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలి. జీఆర్‌ఈ, జీమ్యాట్‌ పరీక్షలపైనా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి’ అని సూచించారు. సమీక్ష సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి, ఆర్జీయూకేటీ ఛాన్స్‌లర్‌ కేసీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: గుంటూరు ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి ఉరిశిక్ష ఖరారు..

Last Updated : Apr 30, 2022, 3:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.