ETV Bharat / city

పాఠశాలలు 6 రకాలు... మండలానికో మహిళా జూనియర్‌ కళాశాల : సీఎం జగన్ - విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష

స్కూళ్లు తెరిచేనాటికి వారికి విద్యాకానుక అందించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం.. స్కూళ్లకు అనుగుణంగా సబ్జెక్టుల వారీగా టీచర్లను నియమించాలన్నారు. ఈ విద్యాసంవత్సరంలో 8వ తరగతి ఆంగ్ల మాధ్యమంలోకి మార్పు చేస్తున్నట్లు తెలిపారు.

స్కూళ్లు తెరిచే నాటికి విద్యాకానుక
స్కూళ్లు తెరిచే నాటికి విద్యాకానుక
author img

By

Published : Apr 13, 2022, 3:59 PM IST

Updated : Apr 14, 2022, 4:16 AM IST

రాష్ట్రంలో జులై నుంచి ఆరు రకాల పాఠశాలలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. 2024 జులై నాటికి దశలవారీగా ఈ పాఠశాలల ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం పాఠశాల విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ..‘అదనపు తరగతి గదులను శరవేగంగా పూర్తి చేయాలి.

ఇవి పూర్తవుతున్న కొద్దీ దశల వారీగా ఆరు రకాల బడులను ప్రారంభించాలి. పాఠశాలల ఏర్పాటుకు అనుగుణంగా సబ్జెక్టు ఉపాధ్యాయులను నియమించాలి. ప్రతి హైస్కూల్‌, హైస్కూల్‌ ప్లస్‌ సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపుతో ఉండాలి. ఆంగ్ల పదాల ఉచ్ఛరణపై యాప్‌ను ఉపాధ్యాయులు, విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి. విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లలోనూ ఈ యాప్‌ అందుబాటులో ఉంచేలా చూడాలి’ అని ఆదేశించారు. ‘వచ్చే విద్యా సంవత్సరంలో 8వతరగతిని ఆంగ్ల మాధ్యమంలోకి మార్పు చేయాలి. ప్రతి మండలానికి రెండు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. వీటిల్లో ఒకటి అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. దీనిపై కార్యాచరణ రూపొందించాలి. నాడు-నేడు రెండోదశ పనుల వేగం పెరగాలి. రెండో దశలో 25వేల పాఠశాలల్లో రూ.11,267కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టాలి. పాఠశాలల్లో గణనీయమైన మార్పులు ఈ ఏడాది కనిపించాలి. ప్రభుత్వ వసతి గృహాలు, 468 జూనియర్‌ కళాశాలల్లో నాడు-నేడు కింద పనులు చేపట్టాలి. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పేరు, ఇందులో భాగస్వాములైన అధికారుల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి. విద్యా కానుకకు గతేడాదితో పోలిస్తే అదనంగా రూ.200కోట్లు ఖర్చయినా పర్వాలేదు. పాఠశాలల్లో చదువుతున్న పిల్లలందరూ మన పిల్లలే. జగనన్న గోరుముద్ద, సంపూర్ణ పోషణలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. నిర్దేశించిన మెనూ ప్రకారం పిల్లలకు ఆహారం అందుతోందా? లేదా? అన్న దానిపై పర్యవేక్షణ ఉండాలి’అని సీఎం అన్నారు.

1 శాటిలైట్‌ ఫౌండేషన్‌ పాఠశాలలుగా పూర్వ ప్రాథమిక విద్య(పీపీ)-1, పీపీ-2 బోధించే అంగన్‌వాడీలు

2 పీపీ-1, పీపీ-2, ఒకటి, రెండు తరగతులు బోధించేవి ఫౌండేషన్‌ పాఠశాలలు

3 పీపీ-1, పీపీ-2, ఒకటి నుంచి ఐదు తరగతులు నిర్వహించేవి ఫౌండేషన్‌ ప్లస్‌ బడులు

4 3 నుంచి 7 లేదా 8 తరగతులవి ప్రీ హైస్కూళ్లు

5 3-10తరగతులు నిర్వహించేవి హైస్కూళ్లు

6 3 నుంచి ఇంటర్మీడియట్‌ వరకు అందుబాటులో ఉంటే హైస్కూల్‌ ప్లస్‌.

భద్రతపై అవగాహన: పాఠశాలలు, కళాశాలల్లో భద్రతపై మహిళా పోలీసులు అవగాహన కల్పించనున్నారని అధికారులు తెలిపారు. విద్యా వ్యవస్థలో మహిళా పోలీసులు నిర్వర్తించాల్సిన విధులపై సీఎం ఆదేశాల మేరకు ప్రామాణిక నిర్వహణ విధానాన్ని(ఎస్‌ఓపీ) అధికారులు రూపొందించారు. బాల్య వివాహాల నివారణ, మత్తు పదార్థాలకు దూరంగా ఉండడం, పోక్సో చట్టంపై అవగాహన, ఫిర్యాదుల బాక్సు నిర్వహణపై విద్యార్థులకు మహిళా పోలీసులు అవగాహన కల్పిస్తారని వెల్లడించారు..

"ప్రతి మండలానికి 2 జూనియర్‌ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. కళాశాలల కార్యాచరణ తయారు చేయాలి. స్కూళ్లు తెరిచేనాటికి వారికి విద్యాకానుక అందించేలా చర్యలు చేపట్టాలి. తగినన్ని తరగతి గదులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. దశలవారీగా ఆరు కేటగిరీల స్కూళ్లు ఏర్పాటు కావాలి. స్కూళ్లకు అనుగుణంగా సబ్జెక్టుల వారీగా టీచర్లను నియమించాలి." - జగన్, ముఖ్యమంత్రి

ఇదీ చదవండి: RTC Charges hike: ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం

Last Updated : Apr 14, 2022, 4:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.