కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచే అంశంపై ముఖ్యమంత్రి జగన్ ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో వ్యాప్తి నిరోధక చర్యలపై కూడా అధికారులతో సీఎం మాట్లాడనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కొరత కొనసాగుతుండటం, ప్రణాళికా బద్ధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టడంపైనా సీఎం జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న చిత్తూరు, విశాఖ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రత్యేక చర్యలపైనా ప్రభుత్వం ఈ సమీక్షలో ఆలోచన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: బాబాయ్‌ని హత్య చేసిన వారిని పట్టుకోవాలని జగన్‌కు లేదా..?