వ్యాక్సినేషన్ తదితర అంశాలపై అధికారులతో సీఎం జగన్ మాట్లాడారు. 104 కాల్ సెంటర్ పూర్తిస్థాయిలో సమర్థంగా పని చేయాలని సూచించారు. 104కి కాల్ చేసిన వారికి తక్షణమే పరిష్కారం చూపాలన్నారు. 104కి కాల్ చేసిన 3 గంటల్లో పడక కేటాయించాలని ఆదేశించారు.
'కొవిడ్ బాధితులకు ఉచితంగానే మందులు ఇవ్వాలి. 104 కాల్ సెంటర్‌కు సంబంధించి వైద్యులు అందుబాటులో ఉండాలి. కొవిడ్ చికిత్స అందిస్తున్న వైద్యశాలలను జేసీ పర్యవేక్షించాలి. జిల్లాస్థాయిలో కొవిడ్ ఆస్పత్రులను క్లస్టర్లుగా విభజించాలి. అన్ని ఆస్పత్రుల్లో సిబ్బంది పూర్తిస్థాయిలో ఉండాలి. ఎక్కడ ఖాళీలున్నా వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించాలి. ఖాళీలు ఉంటే 48 గంటల్లో నియామకాలు పూర్తిచేయాలి. పెళ్లిళ్లకు కేవలం 50 మందికి మాత్రమే అనుమతి. స్విమ్మింగ్‌పూల్స్, జిమ్‌లు, పార్కుల్లో ఒకేచోట చేరకుండా చూడాలి' అని సమీక్షలో సీఎం జగన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'సభ్యుడి పోస్టులకు అడ్మినిస్ట్రేటర్ బాధ్యుడు కాదు'