రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాల నుంచి రైతులకు ఎరువుల హోం డెలివరీ సహా వారికి ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందించే వ్యవస్థ ప్రారంభమైంది. కేంద్రమంత్రులు, సహా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన సాంకేతిక వ్యవస్థను ప్రారంభించారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానందగౌడ, ఆ శాఖ సహాయ మంత్రి మన్‌సుఖ్ మాండవియా ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్‌బీకేల నుంచి ఎరువుల సరఫరాకు సంబంధించి రైతులకు పాయింట్ ఆఫ్ సేల్ వర్షన్, ఎస్‌ఎంఎస్ సర్వీసును సీఎం జగన్ ఆవిష్కరించారు.
ఇదీ చదవండి:
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ కొట్టివేత