ETV Bharat / city

ఎంపీ విజయసాయికి సమన్వయ బాధ్యతలు.. అప్పగించిన జగన్​ - వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి

MP Vijayasaireddy: వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరిన్ని బాధ్యతలు అప్పగించారు. పార్టీ అనుబంధ విభాగాల సమన్వయ బాధ్యతలతో పాటు అదనంగా మరిన్ని బాధ్యతలు అప్పటించారు.

MP Vijayasaireddy
MP Vijayasaireddy
author img

By

Published : Apr 27, 2022, 4:49 AM IST

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి మరిన్ని బాధ్యతలు అప్పగిస్తూ.. ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. పార్టీ అనుబంధ విభాగాల సమన్వయం బాధ్యతలకు అదనంగా.. మరిన్ని బాధ్యతలు ఇచ్చారు. పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షుల సమన్వయ బాధ్యతలనూ సాయిరెడ్డికి అప్పగించారు. ఈనెల 19న పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో ఆర్డినేటర్లను సీఎం నియమించారు. విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గించారనే విమర్శలు వచ్చాయి. దీంతో పునఃసమీక్షించిన సీఎం.. సాయిరెడ్డికి బాధ్యతలు పెంచాలని నిర్ణయించారు. ఈనెల 19న జారీ చేసిన నియామక ఉత్తర్వులను సవరిస్తూ ఆదేశాలిచ్చారు. ఎమ్మెల్యేలు, మీడియా కో-ఆర్డినేషన్ బాధ్యతను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి సీఎం అప్పగించారు.

ఇదీ చదవండి: ఆర్థికవేత్తల ఆందోళన రాష్ట్ర పరిస్థితికి దర్పణం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.