తెలంగాణలో ఉన్న మన రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తున్నానని, మన వాళ్లను ఇబ్బంది పెడతారనే తాను ఎక్కువగా మాట్లాడటం లేదని ముఖ్యమంత్రి జగన్(cm jagan) అన్నారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలని ప్రశ్నించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై(water conflicts) జరిగిన కేబినెట్ సమావేశం(cabinet meeting)లో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధులు చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలపై స్పందించిన ముఖ్యమంత్రి.. నీటి విషయంలో ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించాలని మంత్రులకు సూచించారు. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ అనుమతి లేకుండా నీటిని వినియోగిస్తున్న విషయంలో మరోసారి కేఆర్ఎంబీ(letter to KRMB)కి లేఖ రాయాలని సీఎం ఆదేశించారు. జల వివాదాలపై ప్రధానికి కూడా లేఖ రాయాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు.
తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని ఆలోచిస్తున్నా. మనవాళ్లను ఇబ్బంది పెడతారనే ఎక్కువ మాట్లాడట్లేదు. రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలి. తెలంగాణ మంత్రులు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. నీటి అంశంలో ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి. అనుమతి లేని జలాల వాడకంపై కేఆర్‌ఎంబీకి లేఖ రాయండి. -ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి
ఇవీచదవండి.