ఆప్కో ద్వారా చేనేతలను అన్ని విధాలా ఆదుకుంటామని సంస్థ ఛైర్మన్ చిల్లపల్లి మోహన్‌రావు అన్నారు. ఆకలి చావులు లేకుండా చేసేలా చేనేతలకు ఉపాధి పెంచుతామని తెలిపారు. ఆప్కో ద్వారా చేసే ఉత్పత్తుల నాణ్యత పెంచడంతోపాటు .. కొత్త డిజైన్లు పెంచి వినియోగదారులను ఆకట్టుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఆప్కో ఛైర్మన్‌గా చిల్లపల్లి మోహన్‌రావు బాధ్యతలు చేపట్టారు. ఆప్కో టర్నోవర్‌ను 4 రెట్లు పెంచుతామని స్పష్టం చేశారు. చేనేతల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌కు సీఎం వైఎస్ జగన్ చేయూతనిస్తున్నారని... ఆప్కో అప్పులను తీర్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. చేనేతలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేస్తోందన్నారు.
ఇదీ చదవండి : విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని పట్టుకుంటాం: ప్రభుత్వ సలహాదారు సజ్జల