ETV Bharat / city

నివర్ తుపాను బాధితులను ఆదుకోండి: చంద్రబాబు - చంద్రబాబు టెలీకాన్పరెన్స్ తాజా వార్తలు

నెల్లూరు, చిత్తూరు జిల్లాల ప్రజాప్రతినిధులు, తెదేపా నాయకులతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. నివర్ తుపాను బాధితులను ఆదుకోవాలని వారికి పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉంటూ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలన్నారు.

నివర్ తుపాను బాధితులను ఆదుకోండి
నివర్ తుపాను బాధితులను ఆదుకోండి
author img

By

Published : Nov 26, 2020, 9:16 PM IST

నివర్ తుపాను బాధితులను ఆదుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించిన ఆయన... విపత్తుల సమయంలో బాధితులను ఆదుకోవటం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నా.., ప్రతిపక్షంలో ఉన్నా తెదేపా ప్రజా ప్రజాపక్షమేనని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉంటూ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.

తుపాను ప్రభావం వల్ల భారీవర్షాలతో పంటలు నీటమునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని....,అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈదురుగాలులకు చెట్లు నేలకూలి..,కరెంటు స్థంభాలు విరిగిపడి, రాకపోకలు స్తంభించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కోతకొచ్చిన వరి నీటమునిగి రైతులు తల్లడిల్లుతున్నారని వాపోయారు. ఆయా ప్రాంతాల్లో పంటనష్టంపై అధికారులకు నివేదించాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఇదీచదవండి

రాష్ట్రంలో ఎడతెగని వర్షం... ఈదురుగాలుల బీభత్సం...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.