ETV Bharat / city

జగన్‌..అవగాహనలేని జీరో సీఎం: చంద్రబాబు - పింఛన్లపై అసెంబ్లీలో చర్చ వార్తలు

పింఛన్ల విషయంలో తప్పుడు లెక్కలు చెబుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా హయాంలో 44.32 లక్షల పింఛన్లు ఇచ్చినట్లు చెప్పారని.. తెదేపా హయాంలో 50.29 లక్షల మందికి పింఛన్లు అందజేశామని తెలిపారు. జగన్ అవగాహనలేని.. జీరో ముఖ్యమంత్రి అని విమర్శించారు.

అసెంబ్లీ ఏమైనా జగన్ తాత జాగీరా?: చంద్రబాబు

author img

By

Published : Dec 3, 2020, 5:03 PM IST

Updated : Dec 3, 2020, 10:48 PM IST

పింఛన్లపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతుందని.. చంద్రబాబు మండిపడ్డారు. ఏం మాట్లాడినా చెల్లుతుందని ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏటా పింఛన్ల మొత్తం పెంచుకుంటూ వెళ్తామని చెప్పారని.. ఈ ఏడాది ఇవ్వాల్సిన పింఛను మొత్తం వచ్చే ఏడాది ఇస్తామంటున్నారని పేర్కొన్నారు. తెదేపా ప్రభుత్వం వచ్చి ఉంటే రూ.3 వేలు పింఛను ఇచ్చేవాళ్లమని.. ఒక్కో లబ్ధిదారు రూ.40 వేలు నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు.

జగన్‌..అవగాహనలేని జీరో సీఎం: చంద్రబాబు

వైకాపా ప్రభుత్వం ఏడాదికి రూ.18,750 పింఛను ఇస్తోంది. పింఛన్లపై అసెంబ్లీలో తెదేపా లేవనెత్తితే వైకాపా నేతలు విరుచుకుపడ్డారు. నవరత్నాల పేరిట ప్రజలను మోసం చేస్తున్నారు. అవాస్తవాలు ప్రచారం చేస్తూ అసెంబ్లీని తప్పుదారి పట్టించారు. ప్రజాస్వామ్యంలో ఇష్టానుసారం ప్రవర్తిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు.

- చంద్రబాబు, తెదేపా అధినేత

45 ఏళ్లకే పింఛన్ అన్నారు..

పింఛన్లపై సభల్లో జగన్ చెప్పేది ఓ లెక్క, ప్రభుత్వ డేటాలో ఉంది మరో లెక్క అని చంద్రబాబు మండిపడ్డారు. 45 ఏళ్లకే ఫించన్ ఇస్తానని ప్రచారం చేసి ఆయన బైబిల్లో మాత్రం చేయూత పథకం కింద ఏడాదికి 18750రూపాయలు ఇస్తామని రాసుకున్నారట అని ఎద్దేవాచేశారు. పింఛన్లపై వివిధ సందర్భాల్లో జగన్ మాట్లాడిన వీడియోలను చంద్రబాబు మీడియా సమావేశంలో ప్రదర్శించారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన రామానాయుడును దుర్భాషలాడతారా అని దుయ్యబట్టారు. తెదేపా ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రావద్దంటారా అసెంబ్లీ ఏమైనా జగన్ తాత జాగీరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ల విషయంలో సభను పక్క దారి పట్టించిన సీఎంపై ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వాలని డిమాండ్ ‌చేశారు. జగన్ జీరో ముఖ్యమంత్రని ధ్వజమెత్తారు. వైకాపా నేతల స్థాయిలో తామూ తిట్టగలం కానీ సభ్యత సంస్కారం అడ్డొస్తున్నాయని తెలిపారు. ఎస్సీ ఎమ్మెల్యే స్వామిపై దాడికి యత్నించారని చంద్రబాబు ఆక్షేపించారు.

సామాజిక న్యాయం గురించి మాట్లాడాతారా?

ఒకే కులానికి చెందిన ఎక్కువ మందిని యూనివర్శిటీలకు వీసీలుగా నియమించి సామాజిక న్యాయం గురించి జగన్ మాట్లాడతారా చంద్రబాబు ధ్వజమెత్తారు. బీసీ వర్గానికి చెందిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోసును ద్వారంపూడి ఇంటికి పంపి క్షమాపణ చెప్పించారని విమర్శించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించామని చంద్రబాబు స్పష్టంచేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన చినరాజప్పను ద్వారంపూడి దుర్భాషలాడతారా అని ఆయన మండిపడ్డారు. ఉత్తరాంధ్రని విజయసాయి రెడ్డికి, ఉభయ గోదావరి జిల్లాలను వైవీ సుబ్బారెడ్డికి అప్పజెప్పారని ఆక్షేపించారు. రాష్ట్రం మొత్తం మీద సజ్జల పెత్తనం చేస్తున్నారన్న చంద్రబాబు... ఆయనే డి-ఫ్యాక్టో డీజీపీగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్యేలంతా సూపర్ స్ప్రెడర్లు

దిశా బిల్లును కేంద్రం తిరస్కరిస్తే దిశా చట్టంపై సమీక్ష చేపట్టారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాము నిర్మించిన స్టేషనుకు రంగులేసి దిశా పోలీస్ స్టేషన్ ప్రారంభించేశారని విమర్శించారు. 'వైఎస్ చనిపోతే ఓదార్పు పేరుతో ఇంటింటికి తిరిగి రాజకీయం చేసిన జగన్..., బాధితుల ఇళ్లకు ఎందుకు వెళ్లడం లేదు. మైనార్టీలపై 40 సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడైనా ఉందా?. బడుగు వర్గాలపై దాడులు పెరిగిపోయాయి. బీసీలపై వందల సంఖ్యలో దాడులు జరిగాయి. కార్మూరి నాగేశ్వరరావుకు కరోనా వచ్చినా మాస్కులు పెట్టుకోకుండా మంత్రులు తిరుగుతున్నారు. మాస్కులు లేవు, శానిటైజేషన్ లేదు, ఎమ్మెల్యేలంతా సూపర్ స్ప్రెడర్లుగా మారారు.' అని చంద్రబాబు మండిపడ్డారు.

జమిలీ ఎన్నికలొస్తే ఈ ప్రభుత్వం ఉండదు

రెచ్చిపోతూ తప్పులు చేసే కొందరి పోలీసులకు ఎప్పటికైనా శిక్ష తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. అబ్దుల్ సలాం ఘటనలో ఇప్పటికే పోలీసులు జైళ్లకు వెళ్లారని గుర్తు చేశారు. జమిలీ ఎన్నికలొస్తే ఈ ప్రభుత్వం ఉండదని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని చంద్రబాబు అన్నారు.

రాజకీయాల్లో రజనీకాంత్ రాణించాలి

రజనీకాంత్ తనకు మంచి మిత్రుడని చంద్రబాబు తెలిపారు. ఆయన రాజకీయాల్లోకి వస్తుండటాన్ని స్వాగతిస్తున్నానన్నారు. రాజకీయాల్లో రజనీకాంత్ రాణించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యంలో కొత్త రాజకీయ పార్టీలు వస్తే మంచిదేనని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

Last Updated : Dec 3, 2020, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.