ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికలోకానికి తెదేపా అధినేత చంద్రబాబు మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ వారి హక్కుల పరిరక్షణకు అలుపెరగని పోరాటం చేస్తోందని ఆయన వెల్లడించారు.
తెదేపా హయంలో కార్మికులు, ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేయటంతో పాటు రెండున్నర కోట్ల మంది అసంఘటిత కార్మికులకు చంద్రన్న బీమా పథకం ద్వారా భరోసా కల్పించామన్నారు. వందలాది పరిశ్రమలను నెలకొల్పేలా చేసి లక్షలాది కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు ఆకలితో కార్మికులు ఉండరాదనే అన్న క్యాంటిన్లను ఏర్పాటు చేశామన్నారు. ఆ పథకాలన్నింటినీ జగన్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కరోనా కష్టకాలంలో అనేక ఒడిదుడుకులను, గడ్డు పరిస్థితుల్లను ఎదుర్కొంటున్న కార్మికులకు తెదేపా బాసటగా నిలుస్తుందని భరోసానిచ్చారు.
ఇదీచదవండి