ETV Bharat / city

Tdp Protests: నేడు కలెక్టరేట్ల వద్ద తెదేపా నిరసన.. నరేగా బకాయిల విడుదలకు డిమాండ్

రాష్ట్ర నీటి హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత సీఎంపై ఉందని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతల సమావేశం తీర్మానించింది. చిత్తూరు జిల్లా పర్యటన ముగించుకుని అమరావతి చేరుకున్న చంద్రబాబు.. పార్టీ ముఖ్య నేతలతో ఆన్ లైన్ సమావేశం నిర్వహించి పలు తీర్మానాలను ఆమోదించారు. నరేగా బకాయిల విడుదలకు డిమాండ్ చేస్తూ.. నేడు అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన చేయాలని నేతలకు అధినేత చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు
author img

By

Published : Jul 12, 2021, 10:35 PM IST

Updated : Jul 13, 2021, 7:06 AM IST

రాష్ట్ర నీటి హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత సీఎం పై ఉందని అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతల సమావేశం తీర్మానించింది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటి హక్కులు, విభజన చట్టం11వ షెడ్యూల్ హక్కులు, కేంద్రం 2015లో జారీ చేసిన జీవో నెంబర్ 69, ఉభయ రాష్ట్రాలు చేసుకున్న ఒప్పందాలను ముఖ్యమంత్రి కాపాడి తీరాలని నేతలు స్పష్టం చేశారు.

చిత్తూరు జిల్లా పర్యటన ముగించుకుని అమరావతి చేరుకున్న చంద్రబాబు.. పార్టీ ముఖ్య నేతలతో ఆన్లైన్ సమావేశం నిర్వహించి పలు తీర్మానాలను ఆమోదించారు. నదుల అనుసంధానమే అన్ని నీటి సమస్యలకు పరిష్కారమని తెలిసి కూడా.. తగు రీతిలో నిధులు ఖర్చు చేయకపోవటాన్ని ఖండిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. లెక్కల్లో చూపని 41 వేల కోట్లపై కేంద్ర ఆర్థిక శాఖ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం వెంటనే నరేగా నిధులు పెండింగ్ బకాయిలు చెల్లించాలన్నారు.

అన్ని జిల్లా కలెక్టరేట్​ల వద్ద తెదేపా శ్రేణులు బాధితులతో కలిసి మంగళవారం నిరసనలు నిర్వహించాలని.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని చంద్రబాబు నేతలకు సూచించారు. మైనింగ్ మాఫియాను వ్యతిరేకిస్తున్న గిరిజనుల్ని.. పోలీసులు బెదిరించడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. చట్ట ప్రకారం తగు అనుమతులు లేకుండా మైనింగ్ కు అనుమతులు ఇవ్వటంతో పాటు రహదారి ఏర్పాటు, మైనింగ్ మాఫియాలో పెద్దల పాత్ర రుజువైందని మండిపడ్డారు.

హైకోర్టు జీవో నెంబర్ 2 ను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు పంచాయతీ సర్పంచులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు. పంచాయతీ నిధులను ప్రభుత్వం దారి మళ్లించటాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితులకు తక్షణమే పరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర అఖిలపక్ష యువత డిమాండ్లకు అనుగుణంగా ఉద్యోగ నియామకాలకు రీ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు.

ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా ఈ నెల 15, 16 తేదీల్లో తెదేపా పొలిట్ బ్యూరో, పార్లమెంటరీ పార్టీ సమావేశాలు.. కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. శాప్ మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్ మృతికి నేతలు సంతాపం ప్రకటించారు. సమావేశంలో నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, బండారు సత్యనారాయణమూర్తి, దూళిపాళ్ల నరేంద్ర, ఆలపాటి రాజేంద్ర, టీడీ జనార్థన్, వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

షూస్ ​లేకుండానే పోటీలకు.. ఒలింపిక్స్​కు​ అర్హత

Last Updated : Jul 13, 2021, 7:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.