ETV Bharat / state

ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్న కప్ప - FROG CHANGING DIFFERENT COLORS

శేషాచలం అడవుల్లో ఊసరవెల్లిలా రంగులు మార్చుతూ తిరుగుతున్న కప్ప - గుర్తించడానికి వీల్లేకుండా పరిసరాలలో కలిసిపోతోందన్న స్థానికులు

Color Changing Frog in Tirupati Seshachalam Forest
Color Changing Frog in Tirupati Seshachalam Forest (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2024, 9:22 AM IST

Color Changing Frog in Tirupati Seshachalam Forest : ఇంతవరకూ రంగులు మార్చే ఊసరవెల్లిని మీరు చూసి ఉండవచ్చు. కానీ రంగులు మార్చే కప్పను ఎప్పుడైనా చూశారా? ఏంటి నమ్మశక్యం కావడం లేదా? మీరు వింటున్నది నిజమే. ఇలాంటి కప్పనే ఒకటి తిరుపతి శేషాచలం అడువుల్లో కనిపించింది. ఊసరవెల్లిలా రంగులు మార్చుతూ తిరుగుతున్న కప్పను తిరుపతి నగర పరిధిలోని శేషాచలం అడవులకు సమీపంలో ఉన్న మంగళం ప్రాంతంలో స్థానికులు గుర్తించారు. ఇది పరిసరాలకు తగ్గట్లు రంగులు మార్చుకుంటోంది. దీంతో దీన్ని గుర్తించడానికి వీల్లేకుండా పరిసరాలలో కలిసిపోతోందని స్థానికులు తెలిపారు. ఈ రంగులు మార్చే కప్ప అరుదైన శ్రీలంకన్ పెయింటెడ్ జాతికి చెందినదని తిరుపతికి చెందిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ 'బర్డ్మన్ కార్తీక్ వివరణ ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.