ETV Bharat / city

Chandrababu: అక్రమ కేసులు, దాడులకు బదులు చెల్లిస్తాం: చంద్రబాబు - వైకాపాపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం

తెదేపా నేతలపై పోలీసులు పెట్టే ప్రతీ అక్రమ కేసుకూ, వైకాపా నేతలు చేసే ప్రతీ దాడికి బదులు ఉంటుందని.. తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. వేధింపులు, తప్పుడు కేసుల ప్రతి ఘటనకూ వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు.

chandrababu fires on ycp and police over fake cases on tdp followers
ప్రతి కేసుకు, ప్రతి దాడికీ వడ్డీతో సహా చెల్లిస్తాం: చంద్రబాబు
author img

By

Published : Oct 23, 2021, 7:56 PM IST

తెదేపా నేతలపై తప్పుడు కేసులు పెట్టడం దారుణమని.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు(chandrababu) మండిపడ్డారు. ప్రతి కేసుకు, దాడికీ వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. వైకాపా రౌడీలు తెగబడుతుంటే.. పోలీసులేం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ హక్కుల్ని హరించేలా పోలీసుల తీరుందని ధ్వజమెత్తారు. సామాజిక మాధ్యమాల పోస్టులపై అరెస్టును సుప్రీం తప్పుబట్టిందని చంద్రబాబు గుర్తుచేశారు.

సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారని.. తెదేపా రాష్ట్ర కార్యదర్శి గురజాల సందీప్ మహదేవ్​ను.. పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. కుటుంబ సభ్యులకు ఆచూకీ తెలపకుండా తిప్పటాన్ని ఖండిస్తున్నట్లు ప్రకటించారు. సందీప్​పై వేధింపులు ఆపి, తక్షణమే విడుదల చేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆక్షేపించారు. రాజ్యాంగం విధించిన లక్షణ రేఖను పోలీసులు మీరితే శిక్షలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

Chandrababu Delhi tour: రాష్ట్రంలో పరిణామాలు, అరాచకాల అజెండాగా తెదేపా దిల్లీ పర్యటన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.