ETV Bharat / city

Chandrababu: 'తిరుమల క్షేత్రాన్ని వివాదాలకు కేంద్రంగా మార్చేస్తున్నారు'

తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూ.. వివాదాలకు కేంద్రంగా మారుస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. స్వచ్ఛంద, ఉచిత సేవలు చేస్తున్న వారిని తప్పించి.. లడ్డూ వితరణ, కల్యాణ కట్ట, దర్శన టికెట్ల స్కానింగ్ సేవలను.. ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడం ఎంతవరకు సబబని నిలదీశారు.

chandrababu fires on govt over TTD services
'తిరుమల క్షేత్రాన్ని వివాదాలకు కేంద్రంగా మార్చేస్తున్నారు'
author img

By

Published : Jul 2, 2021, 4:25 PM IST

తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూ.. ఆధ్యాత్మిక క్షేత్రాన్ని వివాదాలకు కేంద్రంగా మార్చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గతంలో జాతీయ బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు.. సేవా దృక్పథంతో భక్తులకు ఉచితంగా సేవలు అందించటం వల్ల.. తితిదే పై పైసా కూడా భారం ఉండేది కాదన్నారు. స్వచ్ఛంద, ఉచిత సేవలు చేస్తున్న వారిని తప్పించి.. లడ్డూ వితరణ, కల్యాణ కట్ట, దర్శన టికెట్ల స్కానింగ్ సేవలను.. ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడం ఎంతవరకు సబబని నిలదీశారు. బ్యాంకులు, శ్రీవారి సేవకుల ద్వారా సాగిపోతున్న ఉచిత సేవలను కాదని.. కమీషన్ల కోసమే.. ఎదురు చెల్లింపులు చేస్తున్నారని ఆరోపించారు. పవిత్ర పుణ్య క్షేత్రంలో వ్యాపార బీజాలు నాటడమేంటని చంద్రబాబు ట్విట్టర్​లో నిలదీశారు.

  • పవిత్ర పుణ్య క్షేత్రంలో వ్యాపార బీజాలు నాటడమేంటి? కమీషన్ల కక్కుర్తి కాకపోతే సజావుగా బ్యాంకులు, శ్రీవారి సేవకుల ద్వారా సాగిపోతున్న ఉచిత సేవలను కాదని ఎదురు చెల్లింపులు చేయడమేంటి?

    — N Chandrababu Naidu (@ncbn) July 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

RRR LETTER TO CM: 'రాజకీయాల కోసం.. నీటి గొడవలు పెద్దవి చేయొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.