ఆప్కాబ్ల ద్వారా అవినీతి రహిత బ్యాంకింగ్ సేవలను అందించాలన్నదే ముఖ్యమంత్రి జగన్ సంకల్పమని.. వ్యవసాయ, సహకార శాఖల మంత్రి కన్నబాబు అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (krishna district cooperative bank) పాలక వర్గంతో మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు. కెడీసీసీ బ్యాంకు నూతన పాలకవర్గం పారదర్శకంగా రైతులకు సేవలందించాలని సూచించారు. ఛైర్మన్‌గా తన్నీరు నాగేశ్వరరరావు, డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు.
సహకార బ్యాంకులను బలోపేతం చేస్తున్నామని.. అందులో భాగంగానే సహకార శాఖలో సంస్కరణలు చేపట్టినట్టు మంత్రి కన్నబాబు వివరించారు. రైతుల భాగస్వామ్యంతో పూర్తి పారదర్శకత కలిగిన వ్యవస్థను తయారుచేస్తున్నామని చెప్పారు. నిధుల దుర్వినియోగం, ఉద్యోగుల నిర్లక్ష్యాన్ని సహించబోమని మంత్రి తేల్చిచెప్పారు. సహకార శాఖలో ఆడిట్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటిల్లో పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ చేపడుతున్నట్టు తెలిపారు. అప్కాబ్లో నూతన మానవ వనరుల పాలసీని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలన
రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ పాలన సాగిస్తున్నారని.. రైతుల కోసం ఎంత ఖర్చు అయినా భరించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కన్నబాబు చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక్క రూపాయి కూడా రైతు ప్రీమియం చెల్లించకుండానే బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమే అన్నారు. రైతు భరోసా, జలకళ, వడ్డీలేని రుణాలు ఇలా రైతులను ఆదుకొనేందుకు తమ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. రాష్ట్రంలో 10,850 ఆర్బీఐ కేంద్రాల ఏర్పాటు చేయడమే కాక వాటిలోనే రైతుల ఉత్పత్తులను అమ్ముకొనేలా మార్కెట్ కేంద్రాలుగా మార్చామని పేర్కొన్నారు.
ఇదీచదవండి..
Shivasri: న్యాయం కోసం ప్రశ్నిస్తే.. నిరాశ్రయురాలిగా మార్చారు..