స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహణకు సంబంధించి కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. ముఖ్యమంత్రులు జెండా వందనం చేస్తారని ఈ వేడుకలకు పోలీసు దళాలు, ఆర్మీ, పారామిలటరీ, ఎన్సీసీ మార్చ్ ఫాస్ట్‌కు మాస్క్ వేసుకుని పాల్గొంటారని స్పష్టం చేసింది. అయితే కొవిడ్-19 దృష్ట్యా వేడుకల్లో భారీ స్థాయిలో జనం పాల్గొనకుండా చూడాలని తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక జాగ్రత్తలు తీసుకుంటూ వేడుకలు చేసుకోవాలని సూచించింది.
కొవిడ్-19పై పోరులో అత్యవసర సమయంలో పని చేసిన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులను స్వాతంత్య్ర వేడుకలకు ఆహ్వానించాలని కేంద్రం స్పష్టం చేసింది. అటు కరోనా నుంచి కోలుకున్న వారిని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని సూచించింది. ఇదే తరహాలో జిల్లాలు, మండలాలు, పంచాయతీ స్థాయిలో నిర్వహించుకోవాలని తెలిపింది. ఇక రాజ్ భవన్లో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమంపై నిర్ణయం గవర్నర్ల విచక్షణకే విడిచిపెడ్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.
ఇదీ చదవండి: