ETV Bharat / city

ఆన్​లైన్ క్లాసుల కోసం వెతుకుతున్నారా..? తస్మాత్ జాగ్రత్త - ఏపీలో ఆన్​లైన్ మోసాల వార్తలు

వీరు ఆన్​లైన్​లో క్లాసులు, కోర్సులు నేర్పుతామంటూ వెబ్​సైట్లలో నకిలీ ఇన్​స్టిట్యూట్ల పేరుతో పబ్లిసిటీ ఇస్తారు. కొంతమంది మొబైల్ ఫోన్స్​కు లింక్​లు పంపుతారు. జాగ్రత్త.. వాటిపై మీరు క్లిక్ చేస్తే మీ వివరాలు తీసుకుని నగదు దోచుకుంటారని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. లాక్​డౌన్ సమయంలో అందరూ ఆన్​లైన్​లో క్లాసులు, కోర్సులు నేర్చుకోవటంతో సైబర్ నేరగాళ్లు ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.

caution.. Looking for online classes ..?
ఆన్​లైన్ క్లాసుల కోసం వెతుకుతున్నారా..? తస్మాత్ జాగ్రత్త
author img

By

Published : Aug 16, 2020, 5:35 PM IST

ఆన్​లైన్ క్లాసుల కోసం వెతుకుతున్నారా..? తస్మాత్ జాగ్రత్త

లాక్​డౌన్ సమయంలో విద్యార్థులు ఆన్​లైన్ తరగతులకే పరిమితమవుతున్నారు. కొంతమంది కొత్త కోర్సులను పూర్తి చేసుకునేందుకు ఆన్​లైన్​లో వెబ్​సైట్లను ఆశ్రయిస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని సైబర్ మోసగాళ్లు నూతన దోపిడీకి తెరతీశారు. కొత్త పథకాలతో అమాయకులను బురిడీ కొట్టిస్తూ నగదు దోచుకుంటున్నారు. వినియోగదారుల విలువైన సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.

కొంతమంది ఉపాధ్యాయులు ఆన్​లైన్ క్లాసులపై పట్టు సాధించేందుకు, మెళకువలు నేర్చుకునేందుకు ఆన్​లైన్ వెబ్​సైట్లను వెతుకుతున్నారు. సైట్​లో వివరాలు సమర్పించాలని అడగటంతో పూర్తి సమాచారం ఇస్తున్నారు. ఆ తర్వాత ఒక ఎస్​ఎమ్​ఎస్ పంపి బ్యాంక్​లో నగదు వేయాలని, రిజిష్టర్​ చేయించుకోవాలని నగదు కాజేస్తున్నారు. మరికొంతమంది ఖాళీ సమయంలో ఆన్​లైన్ కోర్సులు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. ఫలితంగా నకిలీ ఆన్​లైన్ వెబ్​సైట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.

మరోవైపు నూతన కోర్సుల పేరుతో సెల్​ఫోన్​లకు లింకులు పంపుతున్నారు. వీటిపై క్లిక్ చేయగానే వ్యక్తిగత వివరాలు కోరతారు. వాటిని సమర్పించగానే బ్యాంక్ ఖాతాలో రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని ఖాతా నెంబర్​ ఇస్తారు. నగదు వేశారంటే చాలు.. ఆపై మీకు స్పందించరని పోలీసులు చెబుతున్నారు. కరోనా సమయంలో ఇన్​స్టిట్యూట్స్ లేకపోవటంతో క్రిమినల్స్ ఈ పంథాలో నేరాలు చేసేందుకు పథకం సిద్ధం చేస్తున్నారని పోలీసులు వివరిస్తున్నారు.

రాష్ట్రంలో ఈ తరహా మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. వెబ్​సైట్లలో వివరాలు పొందుపరిచేముందు ఒకసారి పరిశీలించాలని చెబుతున్నారు. వెబ్​సైట్ ముందు లాక్​పాడ్ గుర్తు, హెచ్​టిటిపిఎస్ అని ఉన్న వాటిని వినియెగించాలని స్పష్టం చేస్తున్నారు. ఎవరికైనా కోర్సుల కోసం నగదు చెల్లించాలంటే సంస్థల పేర్లు ఉంటాయని, వ్యక్తుల పేర్లతో బ్యాంక్ ఖాతాలు ఎక్కువమంది పెట్టుకోరని వివరిస్తున్నారు.

ఇదీ చదవండీ... ఉద్ధృతంగా గోదావరి... వణికిపోతున్న ముంపు గ్రామాల ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.