ETV Bharat / city

పది రోజుల్లో 20 టన్నుల సరకుల చేరవేత

రాష్ట్ర వ్యాప్తంగా లాక్​డౌన్​ కొనసాగుతోంది. ఫలితంగా ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. ఈ నిబంధన నుంచి సంస్థను కాపాడుకునేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ద్వారా సరకును చేరవేస్తూ ఆదాయాన్ని గడిస్తోంది.

cargo services started in rtc
కార్గోసేవలు ప్రారంభిస్తున్న ఆర్టీసీ సిబ్బంది
author img

By

Published : May 3, 2020, 3:30 PM IST

కరోనా మహమ్మారి దెబ్బకు ప్రైవేటు, ప్రభుత్వ రంగాలు కుదేలయ్యాయి. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడే పెద్దగా గిరాకీ లేక ఆపసోపాలు పడుతూ కాలం నెట్టుకొస్తున్న కార్గో సర్వీసుకు కరోనా కాలంలో బాగా గిరాకీ పెరిగింది. ఫలితంగా ఆర్డర్లు ఆశాజనకంగా ఉన్నాయి. తిరిగి కార్యకలాపాలు ప్రారంభించిన పది రోజుల్లోనే దాదాపు 20 టన్నుల మేర సరకును చేరవేసింది. ఈ స్ఫూర్తితో ప్రజా రవాణా శాఖ భవిష్యత్తులో మరింత రాబడి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రైవేటు సంస్థలు మూతపడడం కూడా కలిసొచ్చింది. దీంతో పలువురు ఆర్టీసీ వైపు చూస్తున్నారు.

లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 22 నుంచి ఆర్టీసీ తన కార్యకలాపాలను ఆపింది. ప్రయాణికుల సర్వీసులతో పాటు కొరియర్‌, కార్గో సేవలను కూడా నిలిపివేసింది. గత నెలలో ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సరకు రవాణాను ప్రారంభించింది. జిల్లాలోని వివిధ డిపోల నుంచి సరకు రవాణా వాహనాల ద్వారా చేరవేస్తోంది. గురువారం నుంచి ప్రభుత్వ పాఠ్య పుస్తకాల తరలింపు ఆర్డర్‌ను డీఈవో ఇచ్చారు. ఆటోనగర్‌లోని విద్యా శాఖ గోదాము నుంచి జిల్లాలోని అన్ని ఎంఈవోల కార్యాలయాలకు దాదాపు 16 లక్షల పుస్తకాలను తరలిస్తున్నారు. నూజివీడు నుంచి హైదరాబాద్‌కు దాదాపు 6 టన్నుల వరకు మామిడిని చేరవేశారు.

* గృహోపకరణాల రవాణాకు సంబంధించి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ఏపీ ఎయిడ్స్‌ నియంత్రణ మండలి నుంచి హెచ్‌ఐవీ మందుల రవాణా కాంట్రాక్టు దక్కింది. ఏఆర్టీ కేంద్రాలకు హైదరాబాద్‌ నుంచి మందులు తీసుకొచ్చారు. విజయవాడ తెచ్చిన అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఆరు వాహనాల ద్వారా రవాణా చేశారు. కరోనా నియంత్రణలో ఉపయోగపడే హైపోక్లోరైడ్‌ ద్రావణం కోసం సీఆర్‌డీఏ, వీఎంసీలకు సరఫరా చేసింది ఆర్టీసీ. ప్రైవేటు మందుల దుకాణదారుల నుంచి భారీగానే ఆర్డర్లు వచ్చాయి.

* ప్రభుత్వ రంగ సంస్థలు అయిన మార్క్‌ఫెడ్‌, ఏపీ సీడ్స్‌ కూడా వివిధ విత్తనాలను వ్యవసాయ శాఖ కార్యాలయాలు, మార్క్‌ఫెడ్‌ కార్యాలయాలకు రవాణా చేస్తోంది. కంప్యూటర్‌ స్టేషనరీ బండిళ్లను విజయవాడ నుంచి రాయలసీమ జిల్లాలకు పంపిస్తున్నారు. ఏప్రిల్‌, 20 నుంచి సరకు రవాణాను ఆర్టీసీ ప్రారంభించింది. ఈ పది రోజుల్లో సుమారు రూ. 10 లక్షల మేర ఆదాయం సమకూరింది. నిషేధిత వస్తువులు మినహా చట్టంలో అనుమతించిన వస్తువులను రవాణా చేస్తామని కృష్ణా రీజియన్‌ కార్గో ఇన్‌ఛార్జి ఏవీ రావు తెలిపారు. సరకు లోడింగ్‌ సమయంలో... తమ సిబ్బంది వ్యక్తిగత దూరం పాటిస్టూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఏవీ రావు తెలిపారు.

ఇవీ చూడండి

ఆగస్టు నుంచి విద్యా సంవత్సరం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.