తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పాఠశాలకు చెందిన బస్సులో మంటలు చెలరేగడం వల్ల ప్రైవేటు పాఠశాల బస్సు పూర్తిగా దగ్ధమైంది. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీప ఆవరణలో ఆ బస్సును నిలిపారు. ఉన్నట్టుండి బస్సులో ఉదయం మంటలు చెలరేగాయి. స్థానికులు ఆర్పేందుకు ప్రయత్నించినా మంటలు తీవ్రంగా వ్యాపించి బస్సు పూర్తిగా తగలబడింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో పక్కనే ఉన్న మరో వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి.
ఇదీ చదవండి:
ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 25,298 మంది చిన్నారులు గుర్తింపు: డీజీపీ