విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ హాలులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. అన్ని కార్మిక సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ చట్టాన్ని రద్దు చేయవద్దని కార్మికులు కోరారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరలించిన నిధులను తిరిగి చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ బోర్డు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగించాలని కోరారు. భవన నిర్మాణ కార్మికుల చట్టాన్ని రద్దును నిరసిస్తూ నవంబరు 26న రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: