ETV Bharat / city

ప్రతీఒక్కరూ మార్షల్ ఆర్ట్స్​ నేర్చుకోవాలి: సినీ నటుడు సుమన్​ - యునైటెడ్‌ థియోలాజికల్‌ రీసెర్చ్‌ యూనివర్సీటీ విజయవాడ వార్తుల

విజయవాడలోని నోవాటెల్‌ హోటల్​లో... యునైటెడ్‌ థియోలాజికల్‌ రీసెర్చ్‌ యూనివర్సీటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బుద్ధ బోధిధర్మ పురస్కారాలు- 2021 కార్యక్రమానికి సినీ నటుడు సుమన్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కుంగ్ ఫు, కరాటే, జిమ్నాస్టిక్స్ వంటి యుద్ధ విద్యలు మహిళల రక్షణకు ఎంతో అవసరమని చెప్పారు.

patta pradanam
ప్రతి ఒక్కరు మార్షల్ ఆర్ట్స్​ నేర్చుకోవాలి: సినీ నటుడు సుమన్​
author img

By

Published : Feb 28, 2021, 8:30 PM IST

ప్రతి ఒక్కరు మార్షల్ ఆర్ట్స్​ నేర్చుకోవాలి: సినీ నటుడు సుమన్​

సమాజంలో పరిస్థితులు మారుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ సినీ నటుడు సుమన్ అభిప్రాయపడ్డారు. విజయవాడలోని నోవాటెల్‌ హోటల్​లో యునైటెడ్‌ థియోలాజికల్‌ రీసెర్చ్‌ యూనివర్సీటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బుద్ధ బోధిధర్మ పురస్కారాలు- 2021 కార్యక్రమానికి ఆయన ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. సినీ నటులు, మా అధ్యక్షులు నరేష్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

కుంగ్ ఫు, కరాటే, జిమ్నాస్టిక్స్ వంటి యుద్ధ విద్యలు మహిళల రక్షణకు ఎంతో అవసరమని అన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను పోలీసు వ్యవస్థ సమర్థంగా నియంత్రిస్తోందని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు వివరించారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల మానసిక స్థైర్యం పెరుగుతుందని చెప్పారు. ప్రపంచానికి యుద్ధవిద్యలు పరిచయం చేసిన బ్రూస్ లీ ఆకర్షణీయమైన రూపం లేనప్పటికీ కేవలం మార్షల్ ఆర్ట్స్ ద్వారా ప్రపంచంలో గొప్ప పేరు తెచ్చుకున్నారని సినీ నటుడు శివ బాలాజీ గుర్తుచేశారు. పలువురు సమాజ సేవకులకు యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఫ్రెడరిక్ ఫ్రాన్సిస్ డాక్టరేట్ పురస్కారాలను ప్రదానం చేశారు.

ఇదీ చదవండి: ఓటరు జాబితా ప్రకారం.. యువకులకు క్రికెట్ కిట్ల పంపిణీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.