వైకాపా, కాంగ్రెస్ పార్టీ అసాధ్యమన్న దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది చంద్రబాబు పాలనలోనేనని బొండా మామహేశ్వరరావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అవినీతితో వోక్స్ వ్యాగన్ కార్ల పరిశ్రమ పారిపోతే, చంద్రబాబు కియా పరిశ్రమను తీసుకొచ్చారని గుర్తుచేశారు. తెదేపా ప్రభుత్వం తీసుకొచ్చిన కియా పరిశ్రమను వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ అవినీతి కోసం వేధిస్తున్నారని మండిపడ్డారు. 15 నెలల్లో పోలవరం సహా, రాష్ట్రంలో ఎక్కడా ఏ పని చేయని వైకాపా ప్రభుత్వం, అబద్ధాలతో కాలం గడుపుతోందని విమర్శించారు. అమరావతి నిర్మాణాలను ఈ ప్రభుత్వం పూర్తి చేసుంటే, అదే రాష్ట్రానికి పాడికుండ అయ్యేదన్నారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులను కమీషన్ల కక్కుర్తితో నిలిపేశారని ఆరోపించారు. 2 వేల పింఛన్ 3 వేలు చేస్తామన్న వైకాపా ప్రభుత్వం 3 నెలలైనా దాన్ని పెంచలేదని బొండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: రైతులు ఒక్క రూపాయి చెల్లించినా.. రాజీనామా చేస్తా: మంత్రి బాలినేని