"రాయలసీమవి అక్రమ ప్రాజెక్టులైతే..తెలంగాణవి సక్రమ ప్రాజెక్టులా ?" అని భాజపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రశ్నించారు. రాయలసీమకు అన్యాయం చేయాలనుకోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. కరువులో ఉన్న సీమ రైతులు సముద్రంలోకి వెళ్ళేనీటిని వాడుకుంటుంటే..అడ్డుకోవాలని తెలంగాణ కేబినెట్లో చర్చించడం బాధ్యతారాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన సమయంలో 'ప్రాంతాలుగా విడిపోదాం-ప్రజలందరం అన్నదమ్మలుగా ఉందాం' అంటే ఇదేనా అని నిలదీశారు.
శ్రీశైలం ప్రాజెక్టులో ముంపు ఆంధ్రాకు నీళ్లు తెలంగాణకు ఇస్తున్నారన్నారు. మేము కూడా మా భూవిు-మా నీళ్లు అంటే మీరు ఒప్పుకుంటారా ? అని ప్రశ్నించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్ ఎందుకు స్పందించటం లేదని విష్ణువర్ధన్ రెడ్డి ఆక్షేపించారు. రెండు పార్టీల మధ్య సంబంధాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను బలి చేస్తారా ? అని మండిపడ్డారు. తెలంగాణాలో వ్యాపారాల కోసం రాయలసీమ ఎంపీలు, ఎమ్మెల్యేలు సీమ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడతున్నారని దుయ్యబట్టారు.
ఇదీచదవండి
రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణాలపై తెలంగాణ కేబినెట్ తీవ్ర అభ్యంతరం