జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశమైన ఇరువురు నేతలు..బద్వేలు ఉప ఎన్నిక అభ్యర్థి, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతోపాటు కొత్త ఆశావహుల గురించి సమావేశంలో చర్చించారు. చర్చ సారాంశాన్ని తమ పార్టీ జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లి తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటామని సోము వీర్రాజు తెలిపారు. చర్చల్లో ఉప ఎన్నిక అభ్యర్థిత్వంపై ఇంకా స్పష్టత రాలేదని జనసేన నేతలు పేర్కొన్నారు. అక్టోబర్ 2న పవన్ శ్రమదానం వివరాలను జనసేన నేతలు సోము వీర్రాజుకు వివరించారు. అక్టోబర్ 7న నెల్లూరులో భాజపా ఆధ్వర్యంలో మత్స్యగర్జన సభ నిర్వహించనుండగా..అందుకు సంబంధించిన వివరాలను భాజపానేతలు పవన్‌కు వివరించారు.
సమావేశంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తదితరలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అక్టోబర్ 2న రోడ్ల శ్రమదానంపై పీఏసీ సభ్యులతో పవన్ భేటీ..