మిగతా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టడమే భాజపాకు సులభతరం కానుందని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. విజయవాడలో మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన ఆయన... దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ నేతృత్వంలో భాజపా శరవేగంగా దూసుకెళ్తోందన్నారు.
కేవలం రాజకీయాలు చేస్తే మనుగడ సాగించలేరన్న ఎంపీ... ఇప్పుడున్నవి పాతతరం రాజకీయాలు కాదు... పని చేస్తేనే ఎవరికైనా గుర్తింపు ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎవరూ రాకపోయినా భాజపా ఎదుగుదల ఖాయమన్న జీవీఎల్... తెదేపాతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు ఎంత మాత్రం లేదన్నారు.
రాష్ట్రంలో తమకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని.... ప్రజలు తమని అదరిస్తారన్న నమ్మకం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాజకీయ పరిణామాలు ఎంత త్వరగా మారుతాయో ఎవరూ ఉహించలేరని ఆయన వ్యాఖ్యానించారు.