COMMITTEE : రాష్ట్రంలోని ప్రజా సమస్యలు గుర్తించి.. వాటికి తగినట్లు ఉద్యమ కార్యచరణ రూపొందించేందుకు 8 మంది సభ్యులతో కూడిన కమిటీని భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసింది. దానికి కన్వీనరుగా రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును నియమించింది. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వీధి సమావేశాలు, బహిరంగ సభలు జరపాలని నిర్ణయించింది. రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధిలో నడిపే సత్తా వైకాపా ప్రభుత్వానికి లేదని విమర్శించింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఒక్కొక్కటి ప్రజలకు వివరించే దిశగా పలు కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5వేల వీధి సమావేశాల నిర్వహణకు సన్నాహామవుతున్నట్లు భాజపా వర్గాలు తెలిపారు.
ఇవీ చదవండి: