ETV Bharat / city

హైదరాబాద్: రిలయన్స్​ డిజిటల్​లో భారీ చోరీ.. షోరూం మూసివేత

హైదరాబాద్ మియాపూర్​లోని రిలయన్స్​ డిజిటల్​ షోరూంలో శుక్రవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. రూ. 40 లక్షల నుంచి 50 లక్షల విలువైన సెల్​ఫోన్​లు చోరీకి గురయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ పండుగ అయినప్పటికీ షోరూంని నిర్వాహకులు మూసివేశారు.

big robbery in reliance digital
హైదరాబాద్: రిలయన్స్​ డిజిటల్​లో భారీ చోరీ.. షోరూం మూసివేత
author img

By

Published : Nov 14, 2020, 5:19 PM IST

హైదరాబాద్​ నగర శివారు మియాపూర్‌ ఠాణా పరిధి మదీనాగూడలోని రిలయన్స్‌ డిజిటల్ షోరూంలో భారీ దొంగతనం జరిగింది. ఈ షోరూంలో సుమారు రూ. 40 లక్షల నుంచి 50లక్షల వరకు విలువైన సెల్‌ఫోన్‌లు దొంగతనానికి గురయ్యాయి. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ దుకాణంలో చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

ఈ రోజు ఉదయం షోరూంను తెరిచి లోపలికి వెళ్లేసరికి సెల్‌ఫోన్‌లు చెల్లాచెదురుగా పడి ఉండటం గమనించిన సిబ్బంది.. యాజమాన్యానికి సమాచారం అందించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సెల్‌ఫోన్‌లతో పాటు ఇతర ఎలక్ట్రికల్ వస్తువులు ఏమైనా చోరీకి గురయ్యాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనం కారణంగా ఇవాళ పండుగ అయిన్పటికీ షోరూం నిర్వాహకులు మూసివేశారు.

ఇదీ చదవండి:

అసలే కరోనా టైం.. టపాసులెందుకు దీపాలు చాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.