రిజర్వేషన్లను కుదించి స్థానిక సంస్థల్లో బీసీలకు... వైకాపా ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపిస్తున్న తెలుగుదేశం...పార్టీ పరంగా కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ ముఖ్యనేతలతో సమాలోచనలు జరిపిన అధినేత చంద్రబాబు...ఈ ఎన్నికల్లో బీసీ రిజర్వేష్లన్లు 34 నుంచి 24శాతానికి తగ్గాయన్నారు. ఆచరణలో కొన్నిజిల్లాలలో 12శాతం కూడా లేవని మండిపడ్డారు.బీసీలను అణచివేసే కుట్రలను అడ్డుకోవాలన్నారు. పార్టీ పరంగా....బీసీలకు 34శాతానికిపైగా సీట్లు కేటాయించాలని నిర్ణయించారు.
ఇదేసమయంలో జగన్‌పాలనా వైఫల్యాలపై 10 ప్రశ్నలతో కూడిన ఒక కరపత్రాన్నిరూపొందించారు. ఆ పాంప్లీట్‌ను విడుదల చేసినపార్టీనేతలువర్లరామయ్య,బొండా ఉమ..జగన్‌ను మళ్లీ నమ్మితే రాష్ట్రం పూర్తిగా మునగడం ఖాయమన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ప్రజలను బెదిరిస్తుంటే... మద్యం, డబ్బు పంచి ఎన్నికల్లో గెలవాలని వైకాపా కుట్ర పన్నుతోందని నేతలు మండిపడ్డారు. వైకాపా నేతల కోడ్ ఉల్లంఘనలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
ఇదీచదవండి
పురపాలిక, నగర పంచాయతీల్లో రిజర్వేషన్లు ఖరారు..ఎన్నికలకు నేడు ప్రకటన