ETV Bharat / city

Minister: 'బీసీ వసతి గృహాలకు అన్ని సౌకర్యాలను కల్పిస్తాం' - Minister Gopalakrishna visited bc women's hostel at ananthapur updates

ప్రతి పేద విద్యార్థి విద్యను అభ్యసించినప్పుడే.. పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గోపాలకృష్ణ అన్నారు. అనంతపురంలోని బీసీ సంక్షేమ శాఖ మహిళా వసతి గృహాన్ని ఆయన పరిశీలించారు. వసతి గృహంలోని సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు.. వంట చేసేవారికి రాష్ట్ర, జిల్లా స్థాయిలో శిక్షణ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. నాణ్యమైన భోజనం అందించి.. వసతి గృహంలో సౌకర్యాలు కల్పించాలని విద్యార్ధులు మంత్రి గోపాలకృష్ణను విన్నవించారు. విద్యార్థుల విన్నపం మేరకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

BC Welfare Minister Gopalakrishna visited bc women's hostel at ananthapur
బీసీ వసతి గృహాలకు అన్ని సౌకర్యాలను కల్పిస్తాం
author img

By

Published : Aug 4, 2021, 2:11 PM IST

తమకు నాణ్యమైన భోజనం అందించి, వసతి గృహంలో సౌకర్యాలు కల్పించాలని.. అనంతపురంలో విద్యార్థులు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గోపాలకృష్ణను కోరారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా.. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డితో కలిసి నగరంలోని బీసీ సంక్షేమ శాఖ మహిళా వసతిగృహాన్ని మంత్రి పరిశీలించారు. అక్కడ ఉన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం.. ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి సైతం పేదరికాన్ని రూపుమాపడానికి.. ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి పేద విద్యార్థి.. విద్యను అభ్యసించినప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని నమ్ముతున్నామన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించటానికి.. వంట చేసేవారికి రాష్ట్ర, జిల్లా స్థాయిలో శిక్షణ ఇవ్వడానికి చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులకు కావలసినన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి.. ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

జిల్లాలో 6 వేల మంది విద్యార్థులు.. వసతి గృహాల్లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. అన్ని సౌకర్యాలతో కూడిన వసతిగృహాన్ని నిర్మించటానికి సహకరించాలని ఎమ్మెల్యే.. మంత్రిని కోరారు. పరిశీలన అనంతరం విద్యార్థులు తమ సమస్యలను మంత్రితో విన్నవించుకున్నారు. మరుగుదొడ్లు దారుణంగా ఉన్నాయని, తాగునీటి సమస్య అధికంగా ఉందని తెలిపారు. వసతి గృహంలో లైబ్రరీని ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థుల విన్నపం మేరకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

viveka murder case: సునీల్‌ను కోర్టులో హాజరుపరచనున్న సీబీఐ అధికారులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.