భుక్తి కోసం కార్మికులు చేసే ప్రతి పోరాటంలో తెదేపా అండగా ఉంటుందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. కార్మిక సోదరులకు మే డే శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. కార్మికుల చెమటలో నుంచి తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకుందన్నారు.
వారికి మద్దతుగా ఎన్టీఆర్ ఖాకీ వస్త్రాలు ఎక్కువగా ధరించేవారని గుర్తు చేసుకున్నారు. శ్రమ దోపిడి నుంచి విముక్తి పొందటంతో పాటు, తమ హక్కులను పోరాడి సాధించుకున్న కార్మిక లోకం అందరికీ స్ఫూర్తిగా నిలిచిందన్నారు.
ఇదీ చదవండి:
ప్రాణాలకే భరోసా లేదు.. భవిష్యత్ గురించి ఏం ఆలోచిస్తారు?: చంద్రబాబు