ETV Bharat / city

జోరందుకున్న ఆటోమొబైల్ అమ్మకాలు - ఆటోమొబైల్ అమ్మకాల జోరు

కరోనా ప్రభావంతో పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయి పలు వ్యాపారాలు కళతప్పినా ఆటోమొబైల్ రంగం మాత్రం ఆశాజనకంగా సాగుతోంది. కరోనా వ్యాప్తి కారణంగా ప్రజలు ప్రజారవాణా కన్నా సొంత వాహనాలపై రాకపోకలకే మొగ్గుచూపుతున్నారు. దీంతో ద్విచక్రవాహనాల కొనుగోళ్లు జోరందుకున్నాయి.

జోరందుకున్న ఆటోమొబైల్ అమ్మకాలు
జోరందుకున్న ఆటోమొబైల్ అమ్మకాలు
author img

By

Published : Jun 17, 2020, 2:46 PM IST

Updated : Jun 17, 2020, 3:32 PM IST

జోరందుకున్న ఆటోమొబైల్ అమ్మకాలు

రోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో ఎన్నో పరిశ్రమలు మూతబడ్డాయి. దాదాపు అనేక రంగాల్లో ఉత్పత్తులు నిలిచిపోయి నష్టాలు ఎదుర్కొంటున్నాయి. లాక్​డౌన్​ సడలింపులు ఇచ్చినా ఇంకా పరిస్థితులు చక్కబడలేదు. కానీ ఆటోమొబైల్ రంగం పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉందని డీలర్లు చెబుతున్నారు.

లాక్​డౌన్​ సమయంలో ఆటోమొబైల్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఉద్యోగుల జీతాలతో పాటు ఇతర ఖర్చులతో ఆటోమొబైల్ డీలర్ షిప్ సంస్థలు నష్టాలు ఎదుర్కొన్నాయి. సడలింపులతో తిరిగి తెరుచుకున్న ఆటోమొబైల్​ షోరూమ్​లలో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది.

ద్విచక్ర వాహనాలకు పెరిగిన గిరాకీ

ప్రభుత్వానికి ఆదాయం ఆర్జించే శాఖల్లో రవాణాశాఖ ప్రధానమైనది. వాహన విక్రయాల ద్వారా రవాణా శాఖకు వచ్చే ఆదాయం ఎంతో కీలకం. కరోనా ప్రభావంతో గడచిన 3 నెలల్లో ఆటోమొబైల్ రంగంలో విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. సడలింపుల తర్వాత పరిస్థితి ఆశాజనకంగా మారిందని, విక్రయాలు పెరిగాయని డీలర్లు చెబుతున్నారు. కరోనా భయంతో సొంత వాహనాల వినియోగానికి ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. కార్లు కొనుగోలు చేసేందుకు డౌన్​పేమెంట్ ఎక్కువగా ఉండడంతో.. ద్విచక్రవాహనాలు తీసుకోడానికి ప్రజలు మొగ్గుచూపుతున్నారని చెప్తున్నారు.

దసరా లాంటి సీజన్​లో ఒక్కో షోరూంలో నెలకు వంద నుంచి 150 వాహనాలు అమ్ముడైతే... సడలింపుల అనంతరం రెండు వారాల్లోనే ఆ స్థాయిలో వ్యాపారం జరిగిందని డీలర్లు చెబుతున్నారు. మరో 2-3 నెలలు ఇదే విధంగా వ్యాపారం కొనసాగితే నష్టాల నుంచి గట్టెక్కినట్లేనని అంచనా వేస్తున్నారు.

సర్వీస్ కేంద్రాలకు క్యూ

వాహన అమ్మకాలకు అనుబంధంగా నడిచే సర్వీస్ సెంటర్లలోనూ రద్దీ పెరుగుతోంది. ఇళ్లకే పరిమితమైన వాహనాలను సర్వీసింగ్ చేయించేందుకు సర్వీస్ కేంద్రాలకు క్యూకడుతున్నారు. కరోనా విస్తరణ, వర్కర్ల సమస్యను అధిగమించి వాహనాల సర్వీస్ చేయటం అదనపు భారంగానే ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. భౌతిక దూరం పాటించాలనే నిబంధనలు ఉండటంతో రద్దీ ఏర్పడకుండా వినియోగదారులకు టైం స్లాట్ విధానాలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. వైద్యులు, పోలీసుల వాహనాల సర్వీసింగ్​కు తొలుత ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్తున్నారు. రవాణా సమస్య కారణంగా వాహన స్పేర్​పార్ట్​లు సకాలంలో రాకపోవటంతో వినియోగదారులందరికీ సర్వీసు అందించటం కష్టం అవుతుందన్నారు.

సెకండ్ హ్యాండ్ వాహనాల జోరు

మూడు నెలలుగా వాహన ఉత్పత్తులు నిలిచిపోవటంతో ఉన్న స్టాక్​ను అమ్ముకోవటానికి ఇదే సరైన సమయంగా డీలర్లు భావిస్తున్నారు. కొత్త స్టాక్ వచ్చేందుకు కొన్ని సమస్యలు ఉన్నందున ఈ లోపు డిమాండ్​కు తగ్గట్టుగా వాహనాల అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. తాజా విక్రయాలు బీఎస్ 6 వాహనాలే కావటంతో సాధారణ వాహనాలతో పోల్చితే వీటి వ్యయం 20 శాతం వరకూ ఎక్కువ ఉన్నప్పటికీ ఆరోగ్య భద్రత దృష్ట్యా విక్రయాలు ఆశాజనకంగానే ఉంటాయని చెప్తున్నారు. సెంకెండ్ హ్యాండ్ వాహనాల విక్రయాలు జోరుగా సాగుతాయని అంచనా వేస్తున్నారు.

లాక్​డౌన్​ తర్వాత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విక్రయాలు చేస్తున్నట్లు డీలర్లు చెబుతున్నారు. రద్దీ లేకుండా సర్వీస్ సెంటర్ వద్ద మార్పులు చేయటంతోపాటు వాహన విక్రయాల వద్ద భౌతిక దూరం పాటించేలా ఏర్పాటుచేశామని తెలిపారు.

ఇదీ చదవండి : కల్నన్ సంతోశ్ చివరి క్షణాల్లో మనసులో రాసుకున్న ప్రేమలేఖ!

Last Updated : Jun 17, 2020, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.