ETV Bharat / city

ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి: ఫారూఖ్ షిబ్లీ

ముఖ్యమంత్రి జగన్​ ఎన్నికల సమయంలో ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలను.. తక్షణం అమలు చేయాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర మైనార్టీ ముఖ్యకార్యదర్శి ఎం.డీ.ఇంతియాజ్​కు వినతిపత్రాన్ని అందజేశారు. దుల్హన్ పథకం, విదేశీ విద్య పథకం, మైనారిటీల సబ్ ప్లాన్ వంటివి ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదన్నారు.

Assurances given to Muslim minorities must be implemented says farooq shibli
ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
author img

By

Published : Jun 14, 2021, 7:00 PM IST

ఎన్నికల సమయంలో సీఎం జగన్ మైనారిటీలకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని.. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ.. రాష్ట్ర మైనార్టీ ముఖ్యకార్యదర్శి ఎం.డీ.ఇంతియాజ్​ను కోరారు. దుల్హన్ పథకం, విదేశీ విద్య పథకం, మైనారిటీల సబ్ ప్లాన్, ఇస్లామిక్ బ్యాంక్, ఏపీఎస్​ఎమ్​ఎఫ్​సీ (APSMFC), వక్ఫ్​ ఆస్తుల పరిరక్షణ, ఇమామ్ మౌజన్​లకు గౌరవ వేతనాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటివరకు ఏ ఒక్క పథకం అమలుకు నోచుకోలేదన్నారు. కరోనాతో మృతిచెందిన ఎస్సీలకు ఇస్తున్న రూ.5లక్షల సబ్సిడీ రుణం.. ముస్లిం మైనారిటీలకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: liquor seized: 2,304 మద్యం పాకెట్లు స్వాధీనం... ఆరుగురు అరెస్టు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.