ETV Bharat / city

అష్టావక్ర గీత.. అద్భుత జ్ఞానబోధ - అష్టావక్ర గీత అద్భుత జ్ఞానబోధ

ఎవరు నిత్య తృప్తితో, ఇంద్రియ శుద్ధితో తనలో తాను ఆనందిస్తుంటారో వారు ఆత్మజ్ఞానం పొందుతారు. వ్యక్తి ఆలోచనలే అతని నడవడికను నిర్దేశిస్తాయి. తాను శరీరం అనుకుంటే శరీరానికి పరిమితం అవుతారు. ఆత్మస్వరూపుడినని తెలుసుకుంటే ఆనందానుభూతిలో ఓలలాడతారు. తనలో ఇతరులను, ఇతరుల్లో తనను చూసుకునేవాడే ఆత్మజ్ఞాని.

Ashtavakra Gita
అష్టావక్ర గీత
author img

By

Published : Apr 1, 2021, 10:26 AM IST

అష్టావక్రుడు ఆత్మజ్ఞాని. ఆయన ప్రవచించిన అష్టావక్ర గీత అద్భుతమైన జ్ఞానబోధ చేస్తుంది. ఇతని ప్రస్తావన మహాభారతంలో కనిపిస్తుంది. తల్లి సుజాత, తండ్రి ఖగోదరుడు. అస్టావక్రుడు తల్లిగర్భంలో ఉన్నప్పుడు ఆయన తండ్రి వేదాలను అసంబద్ధంగా పఠించాడు. దాన్ని ప్రశ్నించడంతో ఖగోదరుడు ‘నీ మనసులాగే నీ శరీరం కూడా వక్రంగా ఉంటుంద’ని శపించాడు. ఫలితంగా ఆ బిడ్డ ఎనిమిది వంకరలతో జన్మించాడు.

అడుగడుగునా అపహాస్యాలే..

శారీరకంగా వైకల్యం ప్రాప్తించినా వేదవేదాంగాల్లో అష్టావక్రుడు అసాధారణ ప్రజ్ఞను సంపాదించగలిగాడు. జ్ఞానపూర్ణుడయ్యాడు. పన్నెండేళ్ల వయసులో ఓ రోజు సీతాదేవి తండ్రి అయిన జనక మహారాజు కొలువుకు వెళ్లాడు. శారీరక వైకల్యం కారణంగా ఆయనకు వెళ్లిన ప్రతిచోటా అవమానాలు ఎదురయ్యేవి. జనక మహారాజు కొలువులో కూడా అలాగే జరిగింది. అష్టావక్రుడు అడుగు పెట్టగానే అపహాస్యాలు వినిపించాయి. తలపండిన మేధావులు, పండితులు కూడా సాధారణ జనం మాదిరిగానే అతడిని చూసి గేలిచేయడం ప్రారంభించారు. వారి వైఖరి చూసిన అష్టావక్రుడు బిగ్గరగా నవ్వసాగాడు. ఒక్కసారిగా జనకుడు అమితాశ్చర్యంతో ‘అష్టావక్రా! వారందరూ ఎందుకు నవ్వుతున్నారో నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వెందుకు నవ్వుతున్నావో నాకు అవగతం కాలేదు’ అన్నాడు.

ఆత్మ వంకరలులేవు..

అప్పుడు అష్టావక్రుడు ప్రశాంతచిత్తంతో, వికసిత వదనంతో ‘జనక మహారాజా! మీ సభలో మేధావులు, పండితులు ఉంటారని, వారిని దర్శించుకుని తరిద్దామని వచ్చాను. కానీ ఇక్కడ అందరూ సాధారణమైన వాళ్లే ఉన్నారు. వారికి పైకి కనిపించే చర్మమే తప్ప, దాని వెనక ఉన్న విశేష గుణగణాలు అవగతం కావని అర్థమైది. ఆలయం వంకరలు తిరిగినంత మాత్రాన అందులోని ప్రతిమ వంకర తిరిగి ఉంటుందా? మట్టికుండ పగిలిపోయినంత మాత్రాన అందులోని చిదాకాశం చితికిపోతుందా? అలాగే నా శరీరం మెలికలు తిరిగిందే కానీ ‘నేను’గా శాశ్వతమైన ఆత్మ వంకరలు తిరిగి లేదు’ అన్నాడు. సభ సిగ్గుతో తలదించుకుంది. జనక మహారాజు వినమ్రంగా అష్టావక్రుడికి సాష్టాంగప్రణామం చేశాడు. అప్పుడు ఆయన బోధించిన విషయాలే అష్టావక్రగీతగా పేరొందాయి. ఈ గీతాసారం అద్వైతాన్ని అద్భుతంగా వివరిస్తుంది.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో 110 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.