ETV Bharat / city

పెరుగుతున్న విద్యుత్ ఛార్జీల భారం.. సౌర విద్యుత్​పై ఆర్టీసీ దృష్టి - సౌర విద్యుత్​పై ఆర్టీసీ దృష్టి వార్తలు

పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు సామాన్యులకే కాకుండా... ప్రభుత్వ రంగ సంస్థలకూ షాక్ ఇస్తున్నాయి. బిల్లుల భారాన్ని తగ్గించుకోవడంపై ఆయా సంస్థలు దృష్టి పెట్టాయి. ఈ జాబితాలో ఏపీఎస్ ఆర్టీసీ ముందంజలో ఉంది. సాధారణ విద్యుత్ స్థానంలో.. సౌర విద్యుత్ ను ఉత్పత్తి చేస్తూ బిల్లులను ఆదా చేస్తోంది. ఇప్పటికే పలు డిపోల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన ఆర్టీసీ.. మంచి ఫలితాలు వస్తుండటంతో అన్ని డిపోల్లోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

సౌర విద్యుత్​పై ఆర్టీసీ దృష్టి
సౌర విద్యుత్​పై ఆర్టీసీ దృష్టి
author img

By

Published : May 28, 2022, 4:31 AM IST

సౌర విద్యుత్​పై ఆర్టీసీ దృష్టి

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విద్యుత్ బిల్లుల పెంపు వల్ల సతమతమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 128 బస్సు డిపోలు సహా.. బస్టాండ్లలో నిర్వహణ కోసం ఏటా కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులు చెల్లిస్తోంది. పెరుగుతున్న విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు... సోలార్ విద్యుత్‌ను పెద్దఎత్తున వినియోగించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో.. సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. డిపోలు, బస్టాండ్లలో విద్యుత్ వినియోగానికి అనుగుణంగా.. తగిన సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఎన్​ఆర్​ఈడీసీఏపీ ద్వారా ఖర్చు లేకుండా ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. తొలుత 24 చోట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలోని 4 బస్సు డిపోల్లో.. 2019లోనే సోలార్ ప్లాంట్లను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. కాకినాడ, మదనపల్లి, చిత్తూరు, నంద్యాల బస్‌స్టేషన్లలో ఏర్పాటు చేసిన 100 కిలోవాట్ సోలార్ ప్లాంట్ల వల్ల వస్తోన్న ఫలితాలను నమోదు చేసి పరిశీలిస్తోంది. స్థానికంగా ఉన్న బస్సు డిపోలు, బస్టాండ్లకు అవసరమయ్యే విద్యుత్‌ను.. అక్కడే ఉత్పత్తి చేసుకుంటోంది. దీని ద్వారా ఆయా బస్ డిపోల్లో విద్యుత్ బిల్లులు 80 శాతం తగ్గినట్లు అధికారులు గమనించారు. ఆర్టీసీ చేసిన ఈ ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి.. స్కోచ్ అవార్డుతో సత్కరించింది. చవకగా సౌర విద్యుత్ వస్తుండటంతో.. త్వరలోనే వీటి ఏర్పాటు దిశగా ఆర్టీసీ చర్యలు చేపట్టింది.

సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా.. విద్యుత్ బిల్లుల భారాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. అవసరానికి మించి విద్యుత్ ఉత్పత్తి అయితే... డిస్కంలకు విక్రయించి అదనపు ఆదాయాన్నీ ఆర్జించవచ్చని భావిస్తోంది.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.