ETV Bharat / city

'పొంతన లేని మాటలతో ప్రజలను మభ్య పెడుతున్న ప్రభుత్వం' - ap govt plan to increase house tax in cities

ఇంటి పన్ను విషయంలో ముఖ్యమంత్రి జగన్, మంత్రులు పొంతన లేని మాటలు చెప్పి ప్రజలను మభ్య పెడుతున్నారని పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్ బాబురావు విమర్శించారు. పన్నుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజయవాడలో డిమాండ్ చేశారు.

apcuf babu rao press meet on house tax
పొంతన లేని మాటలతో ప్రజలను మభ్య పెడుతున్న ప్రభుత్వం
author img

By

Published : Nov 28, 2020, 9:21 PM IST

కరోనా కష్టకాలంలో అన్ని రాష్ట్రాల్లో పన్నులు తగ్గిస్తుంటే.. వైకాపా ప్రభుత్వం మాత్రం ఎందుకు పెంచుతుందో అర్ధం కావడంలేదని పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్ బాబురావు అన్నారు. విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇంటి పన్ను పట్టణాల్లో 15 శాతానికి మించరాదని జగన్ చెప్పాక.. మంత్రి బొత్స మాత్రం పన్నులు పదిరెట్లు పెరుగుతాయని చెబుతున్నారని ఆగ్రహించారు.

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ముందు 15 శాతం పెంచి... ఎన్నికలు అయిన తరువాత 200% పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోందని ఆయన ఆరోపించారు. మంచినీటినీ వదలడం లేదని మండిపడ్డారు. మున్సిపల్ చట్టంలోనూ మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంని అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాల్లో వెనక్కి తగ్గకపోతే.. ప్రజల సహకారంతో పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు.

ఇదీ చదవండి:

'అమ్మ కోసం అత్తింట్లో దొంగతనం... పట్టించిన సీసీ కెమెరాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.