AP Governor Biswabhusan Health Update: హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. పూర్తిస్థాయిలో కోలుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయనకు పోస్ట్ కొవిడ్ లక్షణాలు సైతం అదుపులోకి వచ్చినట్లు రిపోర్టులు వచ్చాయన్నారు. ఆక్సిజన్ సాచురేషన్ లెవల్స్ సైతం సాధారణ స్థాయిలో ఉన్నట్లు ఏఐజీ వైద్యులు పేర్కొన్నారు. ఈ మేరకు ఏఐజీ విడుదల చేసిన మీడియా బులిటెన్‌లో పేర్కొన్నారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి పరిశీలన తర్వాత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను డిశ్చార్చి చేయనున్నట్లు ప్రకటన విడుదల చేశారు.
మరోసారి అస్వస్థతకు గురైన గవర్నర్..
AP Governor Biswabhusan Fell Sick: నవంబర్ 17న దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (AP governor) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గత నెల 23న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. నవంబర్ 28న మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో తరలించారు. స్వల్ప అస్వస్థతకు గురికావడంతో స్థానికంగా ఉన్న ఓ డయాగ్నిస్టిక్ సెంటర్‌లో పరీక్షలు నిర్వహించిన అనంతరం....ఆయన్ని హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి(ap Governor shifted to AIG Hospital at Hyderabad) తరలించారు. ఇటీవల గవర్నర్ కరోనా బారినపడి కోలుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని నగరానికి వచ్చారు.
ఇదీ చదవండి..