ఈఎస్‌ఐ ఔషధాల కొనుగోలు కేసులో ఏసీబీ అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన వెంకటేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. నిందితుడిని విజయవాడ అనిశా కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో ఇటీవలే గుణదల ఈఎస్ఐ సూపరింటెండెంట్‌తో పాటు ముగ్గురు నిందితులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఇదీచదవండి.