ETV Bharat / city

ప్రధాన వార్తలు@11AM - ఏపీ టాప్ న్యూస్

..

andhrapradesh top news
andhrapradesh top news
author img

By

Published : Jan 12, 2021, 11:01 AM IST

  • కాసేపట్లో గవర్నర్​ బిశ్వభూషణ్​తో ఎస్ఈసీ నిమ్మగడ్డ భేటీ

రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కాసేపట్లో‌ కలవనున్నారు. పంచాయతీ ఎన్నికల విషయమై రాజ్‌భవన్‌లో చర్చించనున్నారు. ఎన్నికల నిర్వహణకు సహకరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • దత్తాత్రేయ సంక్రాంతి శుభాకాంక్షలు

హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ దత్తాత్రేయ తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో పర్యటిస్తున్న దత్తాత్రేయను.. రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్.. మర్యాదపూర్వకంగా కలిశారు. కాసేపట్లో.. ముఖ్యమంత్రి జగన్.. ఆయన్ను కలవనున్నారు. అంతకుముందు.. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దత్తాత్రేయ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • చక్కదిద్దే బాధ్యత యువతదే

తెదేపా అధినేత చంద్రబాబు... యువతకు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యతను యువతరమే తీసుకోవాలని సూచించారు. వివేకానందుడు చూపిన బాటలో యువత నడవాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • ప్రియుడిని కత్తితో పొడిచి చంపేసిన ప్రియురాలు

తనను ప్రేమించి.. పెళ్లికి నిరాకరించడన్న కారణంగా ఓ యువతి.. యువకుడిని హత్య చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ధర్మవరం సమీపంలో కలకలం సృష్టించింది. కత్తితో పొడిచి హత్య చేసిన యువతి.. మృతుడి పక్కనే ఫోన్​లో మాట్లాడుతూ ఉండిపోవడం సంచలనం రేపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • సీఎం అభ్యర్థిపై నిర్ణయం వారిదే: భాజపా

రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిని.. ఆ పార్టీ నాయకులే నిర్ణయించుకుంటారని తమిళనాడు భాజపా ఇంఛార్జ్ సీటీ రవి స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే అన్నాడీఎంకే..తమ పార్టీ సీఎం అభ్యర్థి పళనిస్వామి అని పలు మార్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • కరోనా తగ్గుముఖం- 13 వేల దిగువకు కేసులు

దేశవ్యాప్తంగా కొత్తగా 12,584 మంది కరోనా బారిన పడ్డారు. మరో 167 మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 18 వేల మందికిపైగా మహమ్మారిని జయించగా.. రికవరీ రేటు 96.43 శాతానికి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • ఎమర్జెన్సీ పరిస్థితుల మధ్య బైడెన్​ ప్రమాణస్వీకారం!

అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ప్రమాణస్వీకారం ఎమర్జెన్సీ పరిస్థితుల మధ్య జరగనుంది. ఈ నెల 24 వరకు దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలో అత్యవసర పరిస్థితి విధిస్తూ అధ్యక్షుడు ట్రంప్​ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • నష్టాల్లో మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 104 పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం 49,164 వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • కెప్టెన్​గా పైన్‌కు రోజులు దగ్గర పడ్డాయి

సిడ్నీ టెస్టులో టీమ్ఇండియా బ్యాట్స్​మెన్​ను స్లెడ్జింగ్ చేస్తూ కనిపించాడు ఆస్ట్రేలియా సారథి టిమ్ పైన్. ఈ విషయంపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. పైన్ ప్రవర్తన నాయకుడి స్థాయికి తగ్గట్లుగా లేదని విమర్శించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • ఈ మైలురాయికి 20ఏళ్లు పట్టింది

అల్లు అర్జున్ హీరోగా గతేడాది వచ్చిన 'అల వైకుంఠపురములో' 2020లో ప్రేక్షకులకు మధురానుభూతినిచ్చింది. సినిమా వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా వేడుక నిర్వహించింది చిత్రబృందం. కార్యక్రమంలో తమ అనుభవాలను పంచుకున్నారు హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.