ETV Bharat / city

యురేనియంపై కలసికట్టుగా పోరాటం చేస్తాం: అఖిలపక్షం

కడప జిల్లాలో యురేనియం బాధితుల సమస్య పరిష్కరించకుండానే కర్నూలు ఆళ్లగడ్డలో యురేనియం కోసం బోర్లు వేస్తున్నారని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. విజయవాడలో అఖిల పార్టీ నేతలు ఈ మేరకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

అఖిలపక్షం
author img

By

Published : Sep 29, 2019, 11:13 PM IST

అఖిలపక్షం సమావేశం

యురేనియం ..ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు... "యురేనియం తవ్వకాలు - మానవాళికి ప్రమాదం" అనే అంశంపై విజయవాడలో అఖిల పార్టీ నేతల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కడప జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.

ఆళ్లగడ్డలో అన్వేషణ ఆపాలి

ప్రస్తుతం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో యురేనియం కోసం అన్వేషణ చేస్తున్నారు. యురేనియం ఎక్కడుందో తెలుసుకునేందుకు 1500 అడుగుల లోతులో బోర్లు వేస్తున్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపిస్తున్నారు. కడప జిల్లా బాధితులకు న్యాయం చేయకుండా తాజాగా రైతులకు చెప్పకుండా ఆళ్లగడ్డలో యురేనియం నిక్షేపాల అన్వేషణ చేయటం సరికాదని మాజీ మంత్రి అభిప్రాయపడ్డారు.

అసెంబ్లీలో తీర్మానం చేయాలి

ప్రస్తుతం ఆళ్లగడ్డలో జరుగుతున్న యురేనియం డ్రిల్లింగ్​ను నిలిపివేయాలని సీపీఎం నేత మధు డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీలో యురేనియం తవ్వకాలపై వ్యతిరేకంగా తీర్మానం చేశారు. అదే విధంగా ఏపీ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన కోరారు . ఆళ్లగడ్డలో జరుగుతున్న యురేనియం అన్వేషణపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని... త్వరలోనే సదస్సులు ఏర్పాటు చేస్తామని రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలందరు తీర్మానించారు . కడప జిల్లాలో యురేనియం ప్రభావం చూపుతున్న గ్రామాల ప్రజలకు పంటనష్టం ,ఆరోగ్యానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాక్సైట్ గనుల తవ్వకాల నిలిపివేతకు జీవో విడుదల చేసింది . అదేవిధంగా యురేనియం తవ్వకాలపై నిషేదం విధిస్తూ జీవో విడుదల చేయాలని అఖిల పార్టీ నేతలు డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో యురేనియం తవ్వకాలు ఆపకుంటే కలసికట్టుగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

పరిహారం అందించాలి

మరోవైపు యురేనియం తవ్వకాల ప్రభావం ఆరోగ్యంపై పడుతుందని కడప జిల్లా కేకే మండలం వాసులు ఆందోళన చెందుతున్నారు. పంటపొలాలు నష్టపోవటమే కాకుండా శరీరంపై హటాత్తుగా దద్దుర్లు రావటం, పిల్లలకు వైకల్యం సోకడం వంటి పరిణామాలు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పరిహారం చెల్లించి ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి

ఊరు ఊపిరికి..'ఉరే'నియం

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్.... గుంటూరు ఆర్.అగ్రహారం లోని కన్యకపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాలలో భాగంగా 500 కేజీల పసుపుతో వాసవీ దేవీ అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 14 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని బెంగుళూరుకు చెందిన కళాకారులు తీర్చిదిద్దారు. ఇందుకు సుమారు 5 లక్షల వరకు ఖర్చుయినట్లు ఆలయ పాలకమండలి చైర్మన్ దేవరశెట్టి సత్యనారాయణ తెలిపారు. విగ్రహానికి ఇరువైపులా పంచముఖ గణేశుడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. దింతో పాటు అత్తి వరదరాజు స్వామి నమూనాను దసరా ఉత్సవాల లో భక్తుల దర్శనం కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. Body:ఫొటోస్Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.