AITUC dharna at Vijayawada: ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు- ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. అన్ని శాఖల్లోని ఉద్యోగులు, కార్మికులు విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా చేపట్టారు.
కోతలు లేని పీఆర్సీని అమలు చేయాలని.. వేతనాలు సకాలంలో చెల్లించాలని.. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను.. వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లోగా.. కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే.. చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
నిధుల సేకరణలో దుర్గ గుడి పాలకమండలి విఫలం.. ప్రణాళికలకే పరిమితమైన అభివృద్ధి పనులు !