రాష్ట్రంలో 1,750 కోట్లతో ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్స్, అధునాతన టెక్నాలజీతో బ్యాటరీ తయారీ, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల ఏర్పాటునకు కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ సంస్థ ఫౌండర్ అండ్ సీఈవో ఫిరోదియా మొత్వాని, కో–ఫౌండర్ రితేష్ మంత్రి ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి కంపెనీ ప్రణాళికలను వివరించారు.
విశాఖలో బ్రాండెడ్ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ యూనిట్ ఏర్పాటునకూ కైనెటిక్ సంస్థ ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు. స్కిల్ డెవలప్‌మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎంకు తెలిపారు. ఇప్పటికే పుణే సమీపంలోని అహ్మద్‌నగర్‌లో నెలకు 6వేల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ని ఏర్పాటు చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్దిశాఖ స్పెషల్ సీఎస్ వై. శ్రీలక్ష్మి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జవ్వాది సుబ్రహ్మణ్యం, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి
Irrigation Projects: నిర్ణీత సమయంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి: సీఎం జగన్