Man committed suicide : కృష్ణా జిల్లా నందిగామ మండలం తక్కెళ్లపాడు గ్రామంలో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామ వాలంటీర్ వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. తక్కెళ్లపాడు గ్రామ వాలంటీర్ వేల్పుల చిరంజీవికి, మృతుడు మార్కాపూర్ జాన్కి కొంత కాలంగా విభేదాలున్నాయి. దీనిపై స్థానిక పోలీసు స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి. పెద్దల సమక్షంలో ఇటీవలే ఇరువురు రాజీ కుదుర్చుకున్నారు. గ్రామ వాలంటీర్ తిరిగి వేధింపులకు పాల్పడుతుండటంతో మనస్థాపానికి గురై జాన్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన వాలంటీర్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి : కడప: పులివెందుల కోర్టును ఆశ్రయించిన వివేకా పీఏ కృష్ణారెడ్డి..కొందరు భయపెడుతున్నారంటూ పిటిషన్...