సమాజంలో కామాంధుల పైశాచిత్వం పెచ్చరిల్లుతోంది. వావివరుసలు, వయోబేధాలు లేకుండా పేట్రేగిపోతున్న ఉదంతాలు రోజూ ఎక్కడో ఓ చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆ ఊర్లో ఉన్న ఐదురుగు ప్రబుద్ధులు ఇంకో అడుగు ముందుకేసి.. లింగబేధాన్ని కూడా పక్కన పెట్టేశారు. మానసిక వికలాంగుడ(mentally challenged)నే మానవత్వం కూడా లేకుండా వికృత చేష్టల(sexual harassment)కు పాల్పడ్డారు.
అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్న(sexual abuse) వాళ్లను కీచకులుగా చూస్తుంటే.. వీళ్లు అబ్బాయి మీద లైంగిక దాడి(sexual harassment)కి దిగారంటేనే.. వారిలో ఎంత సైకోయిజం ఉందో అర్థమవుతోంది. అందులోనూ.. ఆ బాధితుడు మానసిక వికలాంగుడు(mentally challenged) అని కూడా చూడకుండా లైంగిక దాడి(sexual harassment)కి దిగారంటే.. వారిని ఎమని సంభోదించాలో కూడా అర్థం కాని పరిస్థితి.
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం దొరగారిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 19 ఏళ్ల మానసిక వికలాంగునిపై గత కొన్ని రోజులుగా కొందరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులతో పాటు తండ్రి వయసున్న ఇంకో వ్యక్తి.. మానసిక వికలాంగుని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చారు. రెండు మూడు రోజులుగా బాధితుని ప్రవర్తనలో తేడా రావడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వివరాలు ఆరా తీయగా ఈ దుశ్చర్య వెలుగులోకి వచ్చింది.
కుటుంబసభ్యులు వెంటనే జైపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రవి, నందం, సాదిక్, రాజలింగు, సురేష్ అనే ఐదుగురిపై కంప్లైంట్ ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: