రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత కరోనా కేసులు సెంచరీ దాటాయి. రాష్ట్రంలో కొత్తగా 118 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 8,89,799 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,169 మంది మృతిచెందారు. కొవిడ్ నుంచి మరో 86 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 8.81 లక్షల మందికి పైగా బాధితులు కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 37,041 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు కోటీ 39 లక్షల కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చదవండి