ETV Bharat / city

ఎన్నికలపై తెదేపా పగటి కలలు కంటోంది: ఎమ్మెల్యే రోజా - nagari mla rk roja latest news

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెదేపా నేతలు పగటి కలలు కంటున్నారని ఏపీఐఐసీ ఛైర్​పర్సన్ ఆర్కే రోజా విమర్శించారు. అలాగే తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక కోసం తెదేపా అభ్యర్థిని ప్రకటించటాన్ని తప్పుపట్టారు.

MLA ROJA
MLA ROJA
author img

By

Published : Nov 20, 2020, 7:00 PM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం మార్చిలో పూర్తవుతుండటంతో ఈలోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని తెదేపా నేతలు పగటి కలలు కంటున్నారని ఏపీఐఐసీ ఛైర్​పర్సన్ ఆర్కే రోజా విమర్శించారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రోజా తెదేపాపై విమర్శలు చేశారు.

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక కోసం తెదేపా అభ్యర్థిని ప్రకటించటాన్ని తప్పుపట్టారు. గతంలో అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు మరణిస్తే అక్కడ వైకాపా పోటీ చేయలేదన్న రోజా.... తెదేపా మాత్రం హడావుడిగా అభ్యర్థిని ప్రకటించిందని విమర్శించారు. మరోవైపు తిరుమలలో వేయి కాళ్ల మండపం నిర్మాణానికి ప్రణాళికలు జరుగుతున్నాయని... దీనికి సంబంధించిన ఆకృతులన్నీ తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దగ్గర సిద్ధంగా ఉన్నాయన్నారు.

ఇదీ చదవండి

జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి వైదొలుగుతున్నాం: పవన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.