తిరుమలలో వీఐపీ దర్శన టికెట్లు అధిక ధరలకు విక్రయించిన ఇద్దరు దళారులను తితిదే విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. గుంటూరుకు చెందిన భక్తుడికి రూ. 18 వేలకు, సూర్యాపేటకు చెందిన మరో భక్తుడికి రూ. 21 వేలకు టికెట్లు దళారులు విక్రయించినట్లు గుర్తించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో టికెట్లు తనిఖీ చేస్తుండగా..దళారుల బండారం బయటపడింది. టికెట్ల తనిఖీల్లో భక్తుల నుంచి దళారుల వివరాలు తెలుసుకొని వారిని అరెస్టు చేశారు.
ఇదీ చదవండి