తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్ట దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేసిన వారిపై తితిదే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. ఆలయ ప్రాకారంపై పూర్ణ కలశ ఆకారంలో ఉన్న విద్యుత్ అలంకరణను అన్యమత గుర్తులుగా మార్ఫింగ్ చేసి తాళపత్ర నిధి ఫేస్బుక్ యూఆర్ఎల్...సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పోస్ట్ చేసిందని తితిదే వెల్లడించింది. పవిత్రమైన కళశాన్ని మార్ఫింగ్ చేసి కుట్రపూరితంగా దుష్ప్రచారం చేశారన్నారు. తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే వారిని ఉపేక్షించబోమనని తితిదే హెచ్చరించింది.
ఇదీచదవండి