tirumala tickets released : తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లను తితిదే విడుదల చేసింది. ఉదయం వెబ్‌సైట్‌లో టికెట్ల బుకింగ్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించి... అనంతరం టికెట్లను విడుదల చేశారు. తితిదే వెబ్‌సైట్‌లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. రేపటి నుంచి ఈ నెల 28 వరకు దర్శనాలకు సంబంధించి.. అదనపు కోటా కింద 13 వేల దర్శన టికెట్లను తితిదే విడుదల చేసింది. అలాగే మార్చి నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టికెట్లను కూడా విడుదల చేసింది.
వచ్చే నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లును రోజుకు 25వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శనం టికెట్లను తితిదే జారీ చేస్తుంది. రోజుకు 20 వేల చొప్పున సర్వదర్శనం టికెట్లును భక్తులకు అందిస్తారు.
ఉదయం సాంకేతిక సమస్య..
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ సాంకేతిక సమస్యతో భక్తులు టికెట్లు బుకింగ్ చేసుకోలేకపోయారు. వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య పరిష్కారానికి తితిదే ప్రయత్నం చేసింది.. సమస్య పరిష్కరించి 12 గంటలకు టికెట్లు విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.
ఇదీ చదవండి: