శ్రీవారి దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలో తోపులాట జరిగింది. తితిదే ప్రతిరోజు మూడు వేల ఉచిత సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తోంది. దీని కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తుల పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 31, నవంబరు 1వ తేదీకి సంబంధించిన టోకెన్లను శుక్రవారం రాత్రి 9.45 గంటల నుంచి జారీ చేశారు. ఈ సమయంలో రద్దీ పెరగడంతో పలువురు భక్తులు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వచ్చారు. పిల్లలు, మహిళలు తోపులాటలో నలిగిపోయారు. బారికేడ్లుగా ఏర్పాటుచేసిన రేకులు తగిలి కొందరికి గాయాలయ్యాయి. తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన భక్తురాలు సుజాత సొమ్మసిల్లి పడిపోగా ఆమెను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి : బ్యాంకులపై కొవిడ్ దెబ్బ... బకాయిపడ్డ క్రెడిట్ కార్డు వసూళ్లు